NAVAGRAHA HOMAM PERFORMED_ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం

Tirupati, 27 October 2017: The Navagraha Homam was performed in the famous temple of Sri Kapileswara Swamy in Tirupati on Friday.

Meanwhile Sri Kamakshi Ammavari Homam will be performed on October 28.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం

తిరుపతి, 2017 అక్టోబరు 27: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నవగ్రహ హోమం వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ కామాక్షిఅమ్మవారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

కాగా, అక్టోబరు 28వ తేదీ శనివారం నుంచి తొమ్మిది రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ మణిస్వామి, శ్రీ స్వామినాథస్వామి, శ్రీవిజయస్వామి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.