CVSO STREAMLINES QUEUE IN VQC COMPARTMENT_ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో సివిఎస్‌వో తనిఖీలు

Tirumala, 27 October 2017: TTD chief Vigilance and Security Officer Sri A Ravi Krishna on Friday inspected the compartments in VQC 2.

Following the instructions of EO Sri Anil Kumar Singhal, the CVSO verified the compartments filling and releasing system thoroughly along with VGO Sri Ravindra Reddy, AVSO Sri Nandishwar Babu.

Later he personally monitored the movement of pilgrims without any jostling and enabled smooth flow.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో సివిఎస్‌వో తనిఖీలు

అక్టోబరు 27, తిరుమల, 2017: తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో గల క్యూలైన్లను శుక్రవారం టిటిడి సివిఎస్‌వో శ్రీఆకే రవికృష్ణ తనిఖీ చేశారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు కంపార్ట్‌మెంట్లను పరిశీలించారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులను నింపడం, తిరిగి దర్శనానికి వదిలే విధానాలను విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ నందీశ్వర్‌బాబుతో కలిసి క్షుణ్ణంగా పరిశీలన చేపట్టారు.

అనంతరం క్యూలైన్లలో భక్తుల కదలికలను సివిఎస్‌వో స్వయంగా పరిశీలించి ఎలాంటి తోపులాటలు జరగకుండా ప్రశాంతంగా దర్శనానికి వెళ్లేలా క్యూలను పర్యవేక్షించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.