NAVANEETA KRISHNA DAZZLES ON CHINNA SESHA VAHANAM_ చిన్నశేష వాహనంపై నవనీతకృష్ణాలంకారంలో శ్రీ మలయప్ప
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
చిన్నశేష వాహనంపై నవనీతకృష్ణాలంకారంలో శ్రీ మలయప్ప
అక్టోబరు 01, తిరుమల, 2019 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నవనీతకృష్ణ అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నెమలి పింఛం, పిల్లనగ్రోవి, నవనీతంతో ఉన్న కృష్ణుడి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
చిన్నశేష వాహనం – కుటుంబ శ్రేయస్సు
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ పృథ్విరాజ్, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirumala, 1 Oct. 19: On the second day of the ongoing annual Brahmotsavams at Tirumala on Tuesday morning, the processional deity of Sri Malayappa Swamy was taken out on a celestial ride on Chinna Sesha Vahanam.
As the lord glided on the five hooded Serpent King Vasuki with all His divine splendor along the four Mada streets, the devotees chanted Govinda…Govinda with utmost devotion.
The devotees who witnessed the celestial procession of Lord on Peddasesha Vahanam on first day-night has cherished His divine solo presence on Chinna Sesha Vahanam on second day morning.
The Lord appeared with all resplendence holding butter ball in one hand and flute in another hand and blessed His devotees.
TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI