NAVANEETA KRISHNA SHINES ON CHANDRAPRABHA _ చంద్రప్రభవాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
Tirumala, 25 Sep. 20: On the evening of seventh day of the ongoing Srivari annual Brahmotsavams Sri Malayappa Swamy took out celestial ride on Chandra Prabha Vahanam as “Navaneeta Krishna”(Vennemudda Krishna).
Legends say that Chandra or the moon stands for promoting medicinal values among living beings including plants. As per the legends Chandra is described as Lord Vishnu who as an invisible architect evolved solutions for all ills of the society.
The Bhagavat Geeta also mentions “Nakshatrana Aham Shashi” (I am the moon in the constellation) as the Lord referred Himself to Moon. The Chandra Prabha Vahanam signifies that it’s very sight will provide soothing relief from all physical and mental ailments in society.
TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Board members Sri Ananta, Sri Siva Kumar, Sri Govind Hari, DP Anantha, Sri Sekhar Reddy, Dr Nischitha, Sri Krishnamoorthy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Srivari temple DyEO Sri Harindranath were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
చంద్రప్రభవాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2020 సెప్టెంబరు 25: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్రవారం రాత్రి 7.00 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
చంద్రప్రభ వాహనం – సకలతాపహరం
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, శ్రీ శివకుమార్, శ్రీ శేఖర్ రెడ్డి, శ్రీ గోవిందహరి, శ్రీ డిపి అనంత, ఆలయ డెప్యూటి ఈవో శ్రీ హరీంద్రనాథ్ పాల్గొన్నారు.
కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7.00 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.