NAVANEETHA KRISHNA ON CHANDRA PRABHA VAHANAM _ చంద్రప్రభ వాహనంపై నవనీతకృష్ణుడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

TIRUCHANOOR, 06 DECEMBER 2021: As a part of the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor on Monday, Goddess Sri Padmavathi Devi in the guise of Navaneetha Krishna blessed devotees on Chandra Prabha Vahanam.

 

Both Senior and Junior Pontiffs of Tirumala, JEO Sri Veerabrahmam, DyEO Smt Kasturi Bai and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చంద్రప్రభ వాహనంపై నవనీతకృష్ణుడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి, 2021 డిసెంబరు 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై నవనీతకృష్ణుడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి కస్తూరిబాయి, విజివోలు శ్రీ మనోహర్, శ్రీ బాలిరెడ్డి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసుదన్, ఏవిఎస్వో శ్రీ సాయిగిరిధర్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.