NAVARATHRI UTSAVAMS IN SRI PAT FROM SEPT 21 TO 30_ సెప్టెంబరు 21 నుంచి 30వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

Tirupati, 7 September 2017: The annual Navarathri Utsavams of Goddess Padmavathi Devi at Tiruchanoor will be observed from September 21 to 30 in a big way.

The processional deity of Goddess will be given snapana tirumanjanam during all these nine days in Krishna Mukha Mandapam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
సెప్టెంబరు 21 నుంచి 30వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2017 సెప్టెంబరు 07: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 21 నుంచి 30వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగనుంది.

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 30వ తేదీ విజయదశమినాడు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.