NAVARATRI UTSAVA AT DEVUNI KADAPA SRI LV TEMPLE_ సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
Tirupati, 24 Sep. 19: TTD has set ready to organize the Navaratri festivities from September 29- October 8 at the TTD sub-temple of Sri Lakshmi Venkateswara in Devuni Kadapa, in YSR Kadapa District.
As a part of the festival, there will be snapana thirumanjanam in the morning and Veedhi utsavam in the evening every day which includes Garuda vahanam on October 3, Kalpavruksha on October 4 and Aswa vahanam on October 8.
DyEO Sri Govindarajan is supervising the arrangements.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
తిరుపతి, 2019 సెప్టెంబరు 24: టిటిడికి అనుబంధంగా ఉన్న దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 29న తిరుచ్చి, సెప్టెంబరు 30న శేష వాహనం, అక్టోబరు 1న చంద్రప్రభ వాహనం, అక్టోబరు 2న హనుమంత వాహనం, అక్టోబరు 3న కడప పట్టణంలో, 5న పాత కడపలో గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 4న కల్పవృక్ష వాహనం, అక్టోబరు 6, 7వ తేదీల్లో తిరుచ్చి ఉత్సవం, అక్టోబరు 8న అశ్వవాహనసేవ చేపడతారు. భక్తులందరూ ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది. టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ ఈ ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.