TENDERS FOR PUJA MATERIALS SUPPLY TO APPALAYAGUNTA SRI PVS TEMPLE_ అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయానికి పూజాసామగ్రి సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానం

Tirupati, 24 Sep. 19: TTD has invited sealed tenders for the supply of puja materials, milk, curd, bananas, betel leaves, lemon for Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta from November 1, 2019, to October 31, 2020.

Tenders could be purchased with a DD for ₹250 from the office of DyEO of TTD at Tiruchanoor and contact on 0877-2264685 for more details.

The sealed tenders will be opened on October 15 by 3.30 PM at the DyEO office.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయానికి పూజాసామగ్రి సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానం

తిరుపతి, 2019 సెప్టెంబరు 24: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయానికి 2019, న‌వంబ‌రు 1 నుండి 2020 అక్టోబ‌రు 31వ తేదీ వ‌ర‌కు పాలు, పెరుగుతోపాటు అరటిపండ్లు, తమలపాకులు, నిమ్మకాయలు తదితర పూజాసామగ్రి సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానించడమైనది.

అక్టోబ‌రు 15వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుచానూరులోని డెప్యూటీ ఈవో కార్యాలయంలో సీల్డ్‌ టెండర్లు తెరుస్తారు. టిటిడి ఈవో పేరిట రూ.250/- డిడి తీసి కార్యాలయం వేళల్లో టెండరు పత్రాలు పొందొచ్చు. ఇతర వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264685 నంబరులో సంప్రదించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.