NAVANEETA SEVA TRIAL RUN HELD AT TIRUMALA _ శ్రీవారికి నవనీత సేవ ప్ర‌యోగాత్మ‌క ప‌రిశీల‌న‌

Tirumala, 27 August 2021: The trial run of Navneeta Seva commenced by TTD on Friday at SV Goshala in Tirumala.

 

As part of the exercise the Agnihotram, and Shankhanadam rituals were performed followed by a special puja to Srivaru before commencing the traditional indigenous process of churning the curd to make butter from Desi cows.

 

TTD is all set to commence this Navaneeta Seva on the auspicious occasion of Sri Krishnastami on August 30 at Tirumala for which milk from Desi Gir Cows will be collected to extract the butter.

 

The butter prepared by such an indigenous method will be carried in a procession to Srivari temple from SV Gosala and handed over to the religious staff at Mahadwaram.

   

Annaprasadam DyEO Sri Harindranath, Reception DyEO Sri Lokanatham, former board member of TTD Sri Siva Kumar, natural farming expert Sri Vijayaram, organic food expert Sri Rambabu, SV Goshala veterinary doctor Dr Nagaraj, women Srivari Sevakulu were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారికి నవనీత సేవ ప్ర‌యోగాత్మ‌క ప‌రిశీల‌న‌

తిరుమల, 27 ఆగస్టు 2021: శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవను శుక్ర‌వారం నాడు తిరుమ‌ల‌లోని గోశాల‌లో టిటిడి ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించింది.

ముందుగా అగ్నిహోత్రం, శంఖునాదంతో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. అనంత‌రం శ్రీ‌వారి చిత్ర‌ప‌టానికి పూజ‌లు చేశారు. నాలుగు కుండ‌ల్లో పెరుగు నింపి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌వ్వాల‌తో చిలికారు.

కాగా, ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం నుంచి శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం కానుంది. దేశవాళీ ఆవుల నుంచి ఉత్పత్తి చేసిన పాలను పెరుగుగా మార్చి, దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగిస్తారు. వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకెళ్లి అర్చకులకు అందిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ లోక‌నాథం, టిటిడి బోర్డు మాజీ సభ్యులు శ్రీ శివకుమార్, దేశీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌కులు శ్రీ విజ‌య‌రామ్, చిరుధాన్యాల ఆహార నిపుణులు శ్రీ రాంబాబు, గోశాల వెటర్నరీ డాక్టర్ డా.నాగరాజు, శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.