NEW BOARD CHIEF OF TTD VISITS ANNAPRASADAM_ మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirumala, 22 Jun. 19: The TTD Trust Board new chief Sri YV Subba Reddy, had his maiden visit to Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex on Saturday as soon as he assumed the charge.

The TTD chairman paved a visit to storage room, kitchen and observed the functioning of the mammoth kitchen and dining halls in the conplex. He later interacted with the pilgrims who expressed their immense satisfaction over the taste of Annaprasadam and the serving system.

Later the chairman also dined in the complex. Special Officer Annaprasadam Sri Venugopal, Catering Officer Sri GLN Sastry were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

జూన్ 22, తిరుమల 2019: టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శనివారం ప్రమాణస్వీకారం అనంత‌రం తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో సామాన్య భ‌క్తుల‌తో క‌లిసి అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు. ఈ భ‌వ‌నానికి చేరుకున్న ఛైర్మ‌న్‌కు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి క‌లిసి స్వాగ‌తం ప‌లికారు.

ఈ సంద‌ర్భంగా అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలోని భోజ‌న‌శాల‌లు, వంట‌శాల‌, కోల్డ్ స్టోరేజి, వంట‌స‌రుకుల నిల్వ గ‌దులను ఛైర్మ‌న్ ప‌రిశీలించారు. మ‌రింత ఎక్కువ మంది భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు విత‌ర‌ణ చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. అనంత‌రం అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలోని అధికారులు, సిబ్బందితో మాట్లాడి ప‌లు వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

టిటిడి ఛైర్మ‌న్‌తోపాటు రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి శ్రీ నారాయ‌ణ‌స్వామి, అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీ జి.శ్రీ‌కాంత్‌రెడ్డి, మండ‌లి చీఫ్ విప్ డా.. ఉమ్మారెడ్డి వేంక‌టేశ్వ‌ర్లు, రాజ్య‌స‌భ స‌భ్యుడు శ్రీ విజ‌య‌సాయిరెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు శ్రీ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే శ్రీ బి.క‌రుణాక‌ర్‌రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.