NEW BOARD MEMBER TAKES OATH_ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ రాజేష్ శర్మ, ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ గోవింద హరి ప్రమాణం
Tirumala, 5 Oct. 19: Sri Rajesh Sharma takes oath as a member of the TTD Trust Board in Srivari temple on Saturday.
Tirumala Special Officer Sri AV Dharma Reddy administered her oath in front of Lord Venkateswara inside the Srivari temple. Later he was rendered Vedasirvachanam and given teertha prasadams at Ranganayakula Mandapam.
Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham, Reception DyEO Sri Balaji, Parpathyedar Sri Gurappa and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ రాజేష్ శర్మ, ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ గోవింద హరి ప్రమాణం
అక్టోబర్ 05, తిరుమల 2019: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా ముంబైకి చెెందిన శ్రీ రాజేష్ శర్మ, ప్రత్యేక ఆహ్వానితులుగా హైదరాబాద్ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ గోవింద హరి శనివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గరుడాళ్వార్ సన్నిధిలో వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ రాజేష్ శర్మ, శ్రీ గోవింద హరి కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ శ్రీవారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, పేష్కార్ శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.