NEW JEO TAKES CHARGE IN TIRUMALA TEMPLE_ తిరుపతి నూతన జెఈవోగా శ్రీ పి.బసంత్ కుమార్ బాధ్యతల స్వీకరణ
Tirumala, 4 July 2019: Sri P Basanth Kumar took charges as the new Joint Executive Officer of Tirupati and Full Additional Charge as Tirumala JEO in Sri Venkateswara Swamy temple at Tirumala on Thursday.
Following the temple tradition, earlier he had the darshan of Sri Bhu Varaha Swamy and later entered Tirumala temple through Supadham entry.
Initially, he took charges as Tirupati JEO at the designated muhurat and had darshan of Lord Venkateswara. Later he was rendered Vedasirvachanam at Ranganayakula Mandapam by Vedic priests. Temple DyEO Sri Harindranath offered him Theertha Prasadams and a laminated photo frame of the Lord.
Later, Sri Basanth Kumar took Full Additional Charge (FAC) as JEO of Tirumala from the outgoing Tirumala JEO Sri KS Sreenivasa Raju at Ranganayakula Mandapam.
Speaking on this occasion he said, getting an opportunity to offer services to Lord Venkateswara by serving pilgrims is a rare chance and I wish I could offer services to my best of abilities”, he maintained.
Later the JEO visited Pedda Jiyangar Mutt in Tirumala. HH Tirumala Sri Pedda Jiyar Swamy offered him Asirvachanam. The JEO also offered prayers in the temple of Sri Bedi Anjaneya Swamy.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతి నూతన జెఈవోగా శ్రీ పి.బసంత్ కుమార్ బాధ్యతల స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానములు నూతన తిరుపతి జెఈవోగా శ్రీ పి.బసంత్‌కుమార్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు రంగనాయకుల మండపంలో తిరుమల ఇన్‌చార్జ్ జెఈవో ఎఫ్ఏసిగా తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఆలయం వెలుపల జెఈవో మీడియాతో మాట్లాడుతూ మనసా, వాచా కర్మన శ్రీవారి భక్తులకు సేవ చేయనున్నట్లు తెలిపారు. భక్తుల సేవ ద్వారా శ్రీవారి సేవ చేసే అవకాశం కలగడం పుర్వజన్మ పుణ్యఫలమన్నారు. శ్రీవారి ఆశీస్సులు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం జెఈవో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠాన్ని సందర్శించారు. అక్కడ స్వామివారి ఆశీర్వచనం పొందారు. తరువాత శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీమతి మల్లీశ్వరి, విజివో శ్రీ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.