NEXT GEN APPLICATION OF SRIVARI SEVA SHOULD BE COMPLETED BY SEPTEMBER- TTD EO_ ఆల‌య‌ నిర్మాణ వైశిష్ట్యంపై వీడియోలు రూపొందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

VIDEO DOCUMENTARIES TO PROMOTE SRIVANI TRUST

Tirupati, 27 Jun. 19: To make the philanthropists know about the importance of Sri Venkateswara Alaya Nirmana (SRIVANI) Trust, the TTD EO Sri Anil Kumar Singhal has directed the concerned to prepare a video documentary on the importance of temple construction and upload it in TTD website.

A review meeting on IT was held in the chambers of TTD EO in TTD Administrative Building in Tirupati on Thursday. The EO directed the officials concerned to prepare a 2-3 minute video documentary in an appealing manner to attract more donations for the newly introduced trust of TTD.

He directed the IT officials to get ready the Srivari Seva next gen application by this September and enable more number of devotees to take part in the seva from across the country through online. He said already the volunteers are booking Annaprasadam, kalyanakatta, vigilance, health, reception etc. Services in online and rendering services to pilgrims in Tirumala. The EO also said, the user departments should also be trained in the next gen application when once it is prepared.

The EO instructed the concerned to make Govinda App pilgrim friendly and ensure hassle free mechanism while booking arjitha seva tickets on mobile. He also said the applications created for the sale of gold dollars, properties, infrastructure, etc. Should be verified at regular intervals. He directed the officials concerned to see that there is no delay while issuing time slot sarva darshan tokens to pilgrims.

Tirupati JEO Sri B Lakshmikantham, CVSO Sri Gopinath Jatti, CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji, IT Chief Sri Sesha Reddy and others were also present÷.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఆల‌య‌ నిర్మాణ వైశిష్ట్యంపై వీడియోలు రూపొందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుప‌తి, 2019 జూన్ 27: ఆల‌య‌ నిర్మాణ వైశిష్ట్యంపై దాత‌లకు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వీలుగా 2, 3 నిమిషాల వ్య‌వ‌ధితో కూడిన వీడియోలు రూపొందించి టిటిడి వెబ్‌సైట్‌లో ఉంచాల‌ని, త‌ద్వారా శ్రీ‌వాణి(శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణం) ట్ర‌స్టుకు విరాళాలందించేందుకు ఎక్కువ మంది దాత‌లు ముందుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో గురువారం ఐటి విభాగంపై ఈవో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకుంటున్న భ‌క్తులు శ్రీ‌వాణి ట్ర‌స్టుకు కొంత‌మేర‌కు ఆన్‌లైన్‌లో విరాళాలందిస్తున్నార‌ని, వీటిని మ‌రింత పెంచేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. శ్రీ‌వారి సేవ నెక్ట్స్ జ‌న‌రేష‌న్ అప్లికేష‌న్‌ను సెప్టెంబ‌రు నాటిక‌ల్లా పూర్తి చేయాల‌ని, దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి సేవ‌కులు సుల‌భంగా న‌మోదు చేసుకునేందుకు వెసులుబాటు క‌ల్పించాల‌ని సూచించారు. ఈ అప్ల‌కేష‌న్ పై విభాగాల వారీగా సంబంధిత అధికారులకు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఐటి అధికారుల‌ను కోరారు. ఇప్ప‌టికే అన్న‌దానం, భ‌ద్ర‌త‌, క‌ల్యాణ‌క‌ట్ట‌, రిసెప్ష‌న్ త‌దిత‌ర విభాగాల్లో సేవ‌లందించేందుకు శ్రీ‌వారి సేవ‌కులకు ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకునే సౌల‌భ్యం క‌ల్పించిన‌ట్టు చెప్పారు.

గోవింద మొబైల్ యాప్ ద్వారా శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ఆర్జిత సేవా టికెట్ల‌ను బుక్ చేసుకునే స‌మ‌యంలో లోపాలు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని ఈవో ఆదేశించారు. తిరుప‌తిలోని స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ కౌంట‌ర్ల వ‌ద్ద భ‌క్తులు ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌కుండా త్వ‌రిత‌గ‌తిన టోకెన్లు పొందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఇందుకోసం అవ‌స‌ర‌మైన త‌నిఖీలు చేప‌ట్టాల‌ని తిరుప‌తి జెఈవోను కోరారు. టిటిడి ప్ర‌చుర‌ణ‌లు, బంగారు డాల‌ర్ల విక్ర‌యం, ప‌లు ర‌కాల వ‌స్తువుల వేలం త‌దిత‌రాల‌కు సంబంధించిన సేల్స్ అప్లికేష‌న్‌, ప్రాప‌ర్టీస్ విభాగంలోని ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అప్లికేష‌న్ల‌ను త‌ర‌చుగా ప‌రిశీలించాల‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎఫ్ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, డిఈవో శ్రీ రామ‌చంద్ర‌, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి డా..ర‌మ‌ణ‌ప్ర‌సాద్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.