NO LAXITY ON EMPLOYEES WELFARE- TTD CHAIRMAN _ ఉద్యోగుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

UNBROKEN BONDAGE WITH EMPLOYEES

 

EMPLOYEES DREAMS ACHIEVED BY GOVERNMENT- EO

 

GRATEFUL TO CM AND CHAIRMAN – TTD EMPLOYEES

 

DISTRIBUTION OF HOUSE SITE PATTAS TO EMPLOYEES HELD WITH APLOMB

 

Tirupati, 28 December 2023: The Tirupati legislator and the TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy categorically said on Thursday that there will be no laxity with regard to taking up Hindu Sanatana Dharma activities and employees welfare measures in a big way.

 

He participated as chief guest in the festive event of distribution of employees’ house site pattas held at  Mahati Auditorium in Tirupati on Thursday morning.

 

Speaking on the occasion he said he was immensely happy to give away house site documents to thousands of employees and described it as a momentous day to complete the task which began during his first stint as TTD Chairman 17 years ago and recalled his discussions with the then CM of AP late Dr YS Rajasekhar Reddy and also announced by CM in 2009 on the same platform.

 

A student of TTD educational institutions from 6th standard to Degree, he said he was glad that the decades-old dream of TTD employees had been achieved through the Goodwill of the former CM late Sri YS Rajasekhar Reddy and the present CM of AP Sri YS Jaganmohan Reddy.

 

He said the CM of AP Sri YS Jaganmohan Reddy wanted to give house sites to employees free of cost to all the employees of TTD but is not viable as per law. ”The sites are now given at nominal cost to both employees and by next month even the retired employees will also be given house sites.

 

He complimented the TTD EO Sri AV Dharma Reddy, Tirupati District Collector Sri Venkataramana Reddy, JEOs Smt Sada Bhargavi and Sri Veerabrahmam and others for taking the project further and making it real for employees.

 

He said the District collector granted 350 acres near Pagali and EO approved a grant of 85 crore at board meeting held on December 26 towards land cost.

 

Adding further he said during his entire political stint as MLA and Chairman he strived for the upliftment of poor and employees and employees that though many governments made promises but it was then Sri YS Rajasekhar Reddy and now Sri YS Jaganmohan Reddy who made it possible with a spirit of true leadership.

 

He said the Sri Jaganmohan Reddy is responsible for hiking the salaries of sanitation workers to 5000  and Potu workers to 10000 and categorisation of Vahana bearers and store workers as skilled labour.

 

He urged all employees to consider their growth as a blessing of Sri Venkateswara Swami and strive to give better service to devotees.

 

Speaking on the occasion the TTD EO Sri AV Dharma Reddy highlighted the entire process of house sites procurement from the Government and its development.

 

He said the value of land at Vadamalapeta was around 40 lakhs. The new land of 350 acres purchased at Pagali for  250 crore is a historic decision by the Government.

 

He urged employees to recognise the good things done by this Government and that next phase of house site distribution will be made in next 15 days at the same auditorium.

 

Thereafter PRO Dr T Ravi and others spoke on behalf of TTD employees and thanked the TTD Chairman and EO for allotting them house sites.

 

Later the TTD Chairman and EO gave away house site documents to employees.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఉద్యోగుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

– ఉద్యోగులతో విడదీయరాని బంధం

– టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి

– ఈ ప్రభుత్వం వల్లే ఉద్యోగుల కల సాకారమైంది : టీటీడీ ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి

– ముఖ్యమంత్రివర్యులకు, టీటీడీ చైర్మన్ కు రుణపడి ఉంటాం : టీటీడీ ఉద్యోగులు

– మహతిలో వేడుకగా టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ పండుగ

తిరుపతి, 2023 డిసెంబ‌రు 28: ఉద్యోగుల సంక్షేమం, ధార్మిక ప్రచారంలో వెనుకడుగు వేసేది లేదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కరుణాకర రెడ్డి మాట్లాడుతూ వేలాదిమంది ఉద్యోగులకు తన చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. తన జీవితంలో ఇది మహదానందం కలిగించిన రోజని ఆయన చెప్పారు. 17 సంవత్సరాల క్రితం తాను టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డిని కలిసి ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయమై చర్చించినట్లు చెప్పారు. తన ఒత్తిడి వల్లే ఉద్యోగులకు ఇంటిస్థలాలు మంజూరు చేసినట్టు 2009లో శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే వేదిక మీద తెలియజేశారని ఆయన గుర్తు చేశారు.

తాను ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా టీటీడీ విద్యాసంస్థల్లోనే చదివానని ఆయన చెప్పారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తన ద్వారా సాధించే రోజు రావాలనే కోరిక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సాకారమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాను సంప్రదించినప్పుడు ఆయన ఉద్యోగులందరికీ ఉచితంగా ఇంటి స్థలాలు ఇద్దామని చెప్పారన్నారు. అయితే చట్ట ప్రకారం ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే నామమాత్రపు ధరతో ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. ఈ కార్యక్రమాన్ని సాకారం చేయడంలో ఈఓ శ్రీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఇతర కార్యనిర్వాహకవర్గం తనకు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించారని ఛైర్మన్ అభినందించారు.

పాగాలి వద్ద 350 ఎకరాల భూమి టీటీడీకి ఇవ్వడంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి కృషి కూడా అభినందనీయమన్నారు. ఇందుకోసం బుధవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో 87 కోట్ల రూపాయలు మంజూరు చేయించడంలో ఈవో ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఉద్యోగులతో తమకున్న బంధాన్ని విడదీయలేరని కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. తాను పేరు కోసం కాకుండా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించానన్నారు. తాను రాజకీయాల్లో ఉండడం వల్లే ఎమ్మెల్యేగా, ఛైర్మన్ గా అయ్యానని, ఈ పదవులు రావడం వల్లే పేదల కోసం, ఉద్యోగుల కోసం తాను నిస్వార్ధంగా పనిచేయగలుగుతున్నానని ఆయన చెప్పారు. ఎన్నో ప్రభుత్వాలు ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయం గురించి చూస్తాం, చేస్తామని చెప్పారు కానీ చేసింది మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు.

శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లే టీటీడీలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.5000, పోటు కార్మికులకు పది వేల రూపాయల జీతం పెంచగలిగామని చెప్పారు. అలాగే వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి వారికి కూడా జీతాలు పెంచగలిగే ఏర్పాటు చేయగలిగామన్నారు. ఉద్యోగులు తనను శాసనసభ్యుడుగా కాకుండా మీలో ఒకటిగా చూపిస్తున్న ప్రేమను కలకాలం గుండెల్లో దాచుకుంటానని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సేవను గుర్తించుకోవాలన్నారు. పాలకమండలి నుంచి కిందిస్థాయి ఉద్యోగులందరూ కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి దయతోనే ఇక్కడ ఉన్నామనే విషయాన్ని గుర్తించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేలా ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం 210 కోట్ల రూపాయలు ఉద్యోగుల తరఫున చెల్లించడం చారిత్రాత్మకమని ఆయన చెప్పారు. పాగాలి వద్ద 350 ఎకరాలు త్వరలోనే స్వాధీనం చేసుకుని జనవరి చివరి నాటికి టీటీడీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ కరుణాకర రెడ్డి సహృదయంతో టీటీడీ ఉద్యోగులకు ఎంతో లబ్ధి కలిగిందని ఆయన అన్నారు. వడమాలపేట దగ్గర ప్రస్తుతం ఉద్యోగులకు ఇస్తున్న ఇంటి స్థలం మార్కెట్ విలువ 40 లక్షల రూపాయలకు చేరుకుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం, ధర్మకర్తల మండలి ద్వారా ఎంత మేలు జరిగిందో ఉద్యోగులు గుర్తించాలన్నారు. హెచ్.బి.ఎల్ వారికి కూడా ఇంటి స్థలాలు ఇస్తామని, రెండో విడతగా మరో 15 రోజుల్లో ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం మహతి ఆడిటోరియంలోనే నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యోగులు భక్తుల సేవే ముఖ్యంగా పనిచేయాలన్నారు. భక్తులు హుండీ ద్వారా స్వామివారికి సమర్పిస్తున్న కానుకల వల్లే తమ కుటుంబాలు జీవిస్తున్నాయన్న విషయం గుర్తించి స్వామి సేవలో, ఉద్యోగుల సేవలో అంకితం కావాలని పిలుపునిచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల్లో ఎప్పుడు చేసుకున్నా ఒకటే ఫలితం లభిస్తుందనే విషయం ఉద్యోగులు గుర్తించి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు భక్తుల కోసం సేవ చేసి, మూడవ రోజు నుంచి పదవరోజు దాకా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ విధానం కొనసాగించేలా కృషి చేయాలని ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమం కోసం టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే 800 అప్పీళ్లను కొత్త బోర్డు వచ్చాక పరిష్కరించామని, భవిష్యత్తులో డిఏ కేసులు లేకుండా ఉండేలా ఉద్యోగులు పనిచేయాలని కోరారు.

అనంతరం సీనియర్ అధికారుల సంఘం తరఫున టీటీడీ పీఆర్వో డా. టి.రవి, పలువురు ఉద్యోగులు ప్రసంగించారు. ఆ తరువాత టీటీడీ ఛైర్మన్, ఈవో చేతుల మీదుగా ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.