GRAND PRANAYA KALAHA MAHOTSAVA HELD _ తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

Tirumala, 28 December 2023: As part of the tradition to observe the annual Pranaya Kalaha Mahotsavam on the sixth day after Vaikunta Ekadasi, TTD performed the sacred fete at Tirumala on Thursday evening.

In this connection, the palanquin of  Sri Malayappa Swamy reached the Swami Pushkarini and the palanquins of His consorts Sridevi and Bhudevi reached the location from the opposite side.

The archakas enacted a pranaya kalaha( love fight )  between Swamy and His consorts as the Parayanadars chanted Purana Pathana. Thereafter the consorts offer harati to Swami as a conciliation of their love fight and return back to Srivari temple.

The special feature of this festival is that the archakas also chant the pasuras of the Ninda- Shruthi penned by Sri Nammalwar from the Alwar Divya Prabandham.

Tirumala  pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swami, Temple Deputy EO Sri Lokanatham, VGO Sri Nandakishore, Peishkar Sri Srihari, Parupattedar Sri Tulsiprasad and other officials  were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో వైభవంగా ప్రణయ కలహ మ‌హోత్సవం

తిరుమల, 2023 డిసెంబ‌రు 28: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ప్రణయ కలహ మ‌హోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకీ ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకీపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లతో స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందా – స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, విజివో శ్రీ నంద‌కిషోర్‌, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, పారుప‌త్తేదార్ శ్రీ తుల‌సిప్ర‌సాద్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.