NO ROOM ALLOTMENT TO COTTAGE DONORS ON SEPTEMBER 26 AND 27_ శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు గదుల కేటాయింపు

Tirumala, 6 August 2017: In view of anticipated heavy pilgrims for annual Srivari Brahmotsavams at Tirumala, TTD has taken a decision not to allot cottages even for Cottage Self-Donors on September 26 and 27.

If the donors have donated for more than two rooms in a cottage, they will be allotted two rooms for two days and if the donors have contributed for one room in a cottage, they will also be allotted a room for two days. However the rooms will not be allotted to them on September 26 and 27 in connection with Garuda Seva on September 27. The cottage self-donors have to intimate TTD four days prior and reserve the rooms on TTD website cdms.sevaonline.com. The cottage donors are requested to co-operate with TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు గదుల కేటాయింపు

తిరుమల, 2017 ఆగస్టు 06: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలలో సెప్టెంబరు 27న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 26, 27వ తేదీల్లో మాత్రం కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు. ఈ విషయాన్ని కాటేజి దాతలు గమనించాలని టిటిడి కోరుతోంది.

ఒకే కాటేజిలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళంగా ఇచ్చిన దాతలకు రెండు గదులను రెండు రోజుల పాటు కేటాయిస్తారు. ఒకే కాటేజిలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలకు ఒక గదిని రెండు రోజులపాటు కేటాయించడం జరుగుతుంది. గదులు కావాల్సిన కాటేజి దాతలు 4 రోజులు ముందుగా cdms.ttdsevaonline.com వెబ్‌సైట్‌లో గదులను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది.

కాటేజి దాతలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.