NO SPECIAL PRIVILEGE DARSHAN FOR AGED, PHC AND PARENTS IN MAY AND JUNE_ వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు మే, జూన్‌ నెలలో శ్రీవారి ప్రత్యేక దర్శనం రద్దు

Tirumala, 1 May 2018: In view of heavy rush in Tirumala owning to summer vacation, TTD has cancelled privileged darshan to aged, physically challenged and parents with below five years of age in the months of May and June.

It may be mentioned here that since last August, TTD has been providing 4000 darshan tokens to Physically Challenged and aged pilgrims on any two lean days in a month. Similarly the parents with children below five years of age are also allowed on any two lean days in a month. But as Tirumala is being flooded with summer vacation rush, TTD has cancelled the special privileged darshan for these category of the pilgrims in the months of May and June.

The devotees are requested to make note of it and co-operate with TTD.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు మే, జూన్‌ నెలలో శ్రీవారి ప్రత్యేక దర్శనం రద్దు

మే 01, తిరుమల 2018: వేసవి శెలవుల నేపధ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా టిటిడి మే మరియు జూన్‌ మాసాలలో వయో వృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఇచ్చే శ్రీవారి ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది.

గత ఏడాది ఆగస్టు నెల నుండి టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య రద్దీ దినాలలో 4 వేల మంది వృద్ధులు మరియు దివ్యాంగులకు, అదేవిధంగా 5 సంవత్సరాలలోపు చిన్నరుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే.

ఈ ఏడాది వేసవి రద్దీ కారణంగా మే మరియు జూన్‌ నెలలో ఈ ప్రత్యేక దర్శనాన్ని టిటిడి రద్దు చేసింది. కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి టిటిడికి సహకరించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.