RENDER BEST POSSIBLE SERVICES TO PILGRIMS-TTD CHAIRMAN_ తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలు – టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

Tirumala, 1 May 2018: All departments should render best possible services to pilgrims, said TTD Trust Board Chairman Sri Putta Sudhakar Yadav.

The Chairman of TTD inspected the main Kalyanakatta, Nandakam Mini Kalyanakattas, Narayanagiri queue lines and Kalyana Vedika in Tirumala on Tuesday.

He instructed the concerned to verify the possibility of arranging stools instead of squatting on the floor while the pilgrims are tonsuring their heads. He said every one including the devotees, employees, tonsurers, Srivari Seva volunteers, Scouts should refer each other as “Govinda”.

Later he inspected the queue lines and personally supervised the distribution of Annaprasadam, water, buttermilk, milk etc. to the pilgrims. He also inspected the toilets and other facilities being provided to the pilgrims.

SE II Sri Ramachandra Reddy, Health Officer Dr Sermista, DyEO KKC Smt Nagarathna and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలు – టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

మే 01, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందించాలని టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం టిటిడి ఛైర్మన్‌, అధికారులతో కలిసి తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట, నందకం అతిధి భవనంలోని మిని కళ్యాణకట్టలు, నారాయణగిరి ఉద్యాణవనంలోని క్యూలైన్లను తణిఖీ చేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్‌ మాట్లాడుతూ భక్తులు పవిత్రంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలలో మరింత శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోంట్టున్నట్లు తెలిపారు. కళ్యాణ కట్టలో భక్తి భావం ఉట్టిపడేలా ఫ్లోరింగ్‌, వాల్‌ టైల్స్‌ను మార్చనున్నట్లు వివరించారు. భక్తులు తలనీలాలు సమర్పించే సమయంలో నేలపై కాకుండా చిన్న స్టుల్‌పై కుర్చుని తలనీలాలు సమర్పించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. తిరుమలలో భక్తులు, ఉద్యోగులు, క్షురకులు, శ్రీవారిసేవకులు ఒకరినొకరు ”గోవిందా” అని సంభోదించుకోవాలని కోరారు.

అంతకుముందు టిటిడి ఛైర్మన్‌, అధికారులతో కలిసి తిరుమలలోని నారాయణగిరి ఉద్యాన వనంలోని క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, పాలును శ్రీవారిసేవకుల ద్వారా పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నందకం అతిధి భవనంలోని రెండు మిని కళ్యాణకట్టలు, ప్రధాన కళ్యాణ కట్టలలో భక్తుల రద్దీని, క్షురకులు తలనీలాలు తీస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డా|| శర్మిష్ఠ, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.