NYAYA SUDHA PARAYANAM IN TIRUMALA TEMPLE_ జూలై 21 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీమాన్‌ న్యాయసుధ పారాయణం

Tirumala, 16 July 2018: Following the Aradhana Mahotsavams of HH Sri Jayatheertha from Karnataka, Nyaya Sudha Parayanam will be rendered in Tirumala temple from July 21 to 25 and again from July 29 to August 3 under the aegis of Dasa Sahitya Project of TTD.

As per legend, Sri Jayatheertha in his earlier birth happened to the noble ox in the Ashram of the founder of Dvaita Siddhanta, Sri Madhvacharya. During this period he learnt all the Neetisutras taught by the saint when he was in the form of holy ox.

In his next birth as Jayatheertha, he penned Nyaya Sudha Parayanam. It is believed that on rendering Nyaya Sudha, it will give good showers and prosperity prevails. With this great work Sri Jayatheertha is also known as Teekacharya.

Meanwhile this Nyayasudha Parayanam will be recited every day in Tirumala facing Vimana Venkateswara Swamy, by eminent vedic pundits,during the above said dates.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 21 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీమాన్‌ న్యాయసుధ పారాయణం

తిరుమల, 2018 జూలై 16: శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 21 నుంచి 25వ తేదీ వరకు, తిరిగి జూలై 29 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు శ్రీమాన్‌ న్యాయసుధ పారాయణం జరుగనుంది. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

శ్రీవారి ఆలయంలోని విమాన వేంకటేశ్వరస్వామివారికి ఎదురుగా వేదపారాయణదారులు న్యాయసుధను పారాయణం చేస్తారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈ పారాయణం జరుగుతుంది.

ద్వైతసిద్ధాంత ప్రతిష్టాపనాచార్యులైన శ్రీ మధ్వాచార్యులు ఆసేతు హిమాచలం సంచరించి శిష్యులకు సత్‌ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ 37 గ్రంథాలకు పైగా రచించారు. శ్రీవారి భక్తుడైన శ్రీ జయతీర్థులవారు పూర్వజన్మలో వృషభరూపంలో శ్రీ మధ్వాచార్యుల సన్నిధిలో ఉంటూ ద్వైత సిద్ధాంతభావాన్ని పూర్తిగా శ్రవణం చేసిన ప్రభావంతో తరువాత జన్మలో ఈ గ్రంథాలకు ‘న్యాయసుధ’ పేరుతో వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించి టికాచార్యులని ప్రసిద్ధి పొందారు. వీరి సాహిత్యాన్ని శ్రీపురందరదాసుగ్రహించి వేల కీర్తనలు రచించారు. ‘న్యాయసుధ’ గ్రంథాన్ని పారాయణం చేయడం వల్ల వర్షాలు బాగా కురిసి దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రపంచశాంతి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.