OATH ADMINISTERED _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా డా. ఎస్.శంకర్ ప్రమాణస్వీకారం
TIRUMALA, 25 SEPTEMBER 2021: Dr S Shankar took oath as TTD Trust Board member on Saturday in Srivari temple.
He was administered the oath of office at Bangaru Vakili inside Srivari temple by TTD JEO Smt Sada Bhargavi.
After darshan of Sri Venkateswara Swamy he was rendered Vedaseervachanam at Ranganayakula Mandapam and was presented with Theertha Prasadams, laminated photo and Coffee Table book of Srivaru.
Deputy EOs Sri Ramesh Babu, Sri Lokanatham, Smt Sudharani were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా డా. ఎస్.శంకర్ ప్రమాణస్వీకారం
తిరుమల, 2021 సెప్టెంబరు 25: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా డా. ఎస్.శంకర్ శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను జెఈఓ అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి సుధారాణి, శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.