OFFER SERVICES TO COMMON DEVOTEES WITH PATIENCE – TTD CHAIRMAN INTERACTS WITH PILGRIMS _ శ్రీవారి సేవ ను స్వామి సేవగానే భావించాలి

Tirumala, 06 March 2022: TTD Chairman Sri YV Subba Reddy enquired with common devotees on darshan and other facilities by entering Vaikuntham queue lines on Sunday.

 

He also interacted with the Srivari Sevakulu group led by Smt Lavanya from Nizamabad and enquired about their service details.

 

TTD Chairman suggested that Srivari Sevakulu to be patient and offer services to common devotees and consider Srivari Seva as a unique opportunity to serve Sri Venkateswara Swamy Himself through service to devotees.

 

He also spoke to other devotees in queue lines and assured that henceforth devotees with SSD tokens could have Srivari Darshan on the same day without any hurdles.

 

Many devotees informed the chairman that facilities at Kalyana Katta, Annaprasadam etc. are excellent and expressed happiness over Srivari Darshan after two years and thanked the Chairman.

 

A devotee from Divas town of Madhya Pradesh Sri Surendra Rathod called on TTD Chairman and said he had come for darshan with his family after booking SED tickets and expressed happiness over all the facilities at Tirumala.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి సేవ ను స్వామి సేవగానే భావించాలి
– సామాన్య భక్తులకు ఓర్పు, సహనంతో సేవలందించాలి
– సర్వదర్శనం టోకెన్ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తున్నాం
– సామాన్య భక్తుల క్యూ లో శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 6 మార్చి 2022: శ్రీవారి సేవకులు భక్తులకు అందించే సేవ స్వామి వారికి చేసినట్లుగానే భావించాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

ఆదివారం ఆయన సామాన్య భక్తుడి వలే క్యూ లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయం లోపల శ్రీవారి సేవలో ఉన్న నిజామాబాద్ కు చెందిన లావణ్య తో పాటు వారి గ్రూప్ సభ్యులు భక్తులకు చేస్తున్న సేవను ప్రత్యక్షంగా చూసి వారిని అభినందించారు. శ్రీవారి సేవ ఎన్ని రోజులుగా చేస్తున్నారు. ఆలయంలో ఎన్ని రోజులు చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు.

సామాన్య భక్తుల విషయంలో ఓర్పు, సహనంతో వ్యవహరించి దర్శనం చేయించి పంపాలని వారికి సూచించారు. శ్రీవారి సేవ రూపంలో భగవంతుడు భాగ్యం కల్పించారని, ఏ ప్రాంతంలో సేవ చేసినా స్వామి వారికి చేసినట్లు గానే భావించాలని చెప్పారు.

క్యూలో ఉన్న భక్తులతో చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడారు. సర్వదర్శనం లో వచ్చే భక్తులకు టోకెన్ తీసుకున్న రోజే ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామన్నారు. అన్నదానం, కళ్యాణ కట్ట, దర్శనం వద్ద వసతులు బాగున్నాయని భక్తులు చైర్మన్ కు సంతోషంగా చెప్పారు. రెండేళ్ళ తరువాత సర్వదర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించారని చైర్మన్ ను అభినందించారు.

ఆన్లైన్ లో దర్శనం టికెట్ బుక్ చేసుకున్నామని, తిరుమల లో ఏర్పాట్లు బాగున్నాయని, దర్శనం కూడా సంతృప్తి గా జరిగిందని మధ్యప్రదేశ్ రాష్ట్రం దివాస్ పట్టణానికి చెందిన శ్రీ సురేంద్ర రాథోడ్ చైర్మన్ ను కలసి సంతోషం వ్యక్తం చేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది