SRI RAMA NAVAMI BRAHMOTSAVAMS OFF TO A COLOURFUL START IN VONTIMITTA _ ధ్వజారోహణంతో వైభవంగా  శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Vontimitta, 17 April 2024: The annual Brahmotsavam in Vontimitta Sri Kodanda Ramalayam off to a grand start with Dhwajarohanam on Wednesday.

The entire temple premises reverberated to the rhythmic Vedic mantras from Pancharatra Agama.

As the Pundits were chanting the hymns, the Garuda flag was hoisted on the temple pillar in the auspicious Mithuna Lagnam.

Each deity including Asta Dikpalakas, Vishwaksena, Panchabhutas etc. were appeased and invited to participate in the mega-religious event by rendering a specific raga and a Tala.

Various Talams like Akhya talam

Varuna talam

Eka talam

Adi talam

Jampala talam

Bhringini talam

Rupaka talam

Gamdharva Yalam

Nandi Talam besides 

Anandavardhana Ragam

Suruti Ragam

Nadanamakriya

Lalita 

Malaya Ragam

Megharanjani Ragam

Vasantabhairavi

Bhairavi

Srikara

Shankarabharanam

Ragas were rendered in Nadaswaram in a melodious manner.

Speaking on the occasion, JEO Sri Veerabrahmam said the annual utsavams commenced in colourful way and tge celestial Sita Rama Kalyanam on April 22 between 6:30pm and 8:30pm. Elaborate arrangements of Annaprasadam, buttermilk and water distribution, security arrangements have been made for the sake of devotees in coordination with District Administration

EE Sri Krishna Reddy, DyEOs Sri Natesh Babu, Sri Siva Prasad, DFO Sri Srinivas, Garden Superintendent Sri Srinivasulu, VGO Sri Bali Reddy and other officials, devotees, archakas were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా  శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2024 ఏప్రిల్ 17: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధ‌వారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 నుండి 11 గంటల మధ్య మిథున‌ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వ‌హించారు. కంకణబట్టర్‌ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 20న హనుమంత వాహనం, ఏప్రిల్ 22న కల్యాణోత్సవం, ఏప్రిల్ 23న రథోత్సవం, ఏప్రిల్ 25న చక్రస్నానం జరుగుతాయన్నారు.

ఏప్రిల్ 22న సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని కల్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు.

కంకణబట్టర్‌ శ్రీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మీలనం నిర్వహించామన్నారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసినట్టు చెప్పారు. రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు వివరించారు.

ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, విజివో శ్రీ బాలి రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.