ON-LINE DIP SYSTEM IS TRANSPARENT-TTD EO_ ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

REINTRODUCE PROGRAMS IN SVBC

ORGANIZE ANNAMACHARYA SANKEERTANA UTSAVAM IN CHENNAI IN A BIG WAY

Tirumala, 6 April 2018: The online system of allocation of arjitha seva tickets through dip system is a transparent mechanism, asserted TTD EO Sri Anil Kumar Singhal.

The monthly Dial your EO programme was held at Annamaiah Bhavan in Tirumala on Friday. The received the calls from 23 pilgrims from different parts of the country which also includes a call from Saudi Arabia.

Callers Sri Srinivas from Visakhapatnam, Sri Sankar from Hyderabad, Sri Jitendra from West Godavari sought EO to reconsider allocating certain quota of arjitha seva tickets under current booking in Tirumala for which the EO replied them that the decision of online dip has been taken after considering the suggestions from majority of pilgrims and the system is very transparent.

Answering another caller Sri Subramaniam from Chennai who sought EO to reconsider introducing programmes like Sastipurthi, Brahmande Nastikinchana etc.inSVBC. The EO said, his suggestions are well taken. He also suggestion the EO to organise Annamacharya Sankeetana programme in a big in Chennai which was conducted about 15years ago. While another caller Sri Sriranganathan from Chennai sought EO to provide minimal facilities of fan and drinking water to the artistes performing on Nadaneerajanam stage.

Sri Kesavan from Nagari sought EO to introduce Annaprasadam in Srivari Mettu footpath route and EO said it is operationally not feasible. Another caller Sri Suresh from Nellore sought EO to introduce chutney or pickle along with Upma and Pongal as many pilgrims are wasting the Prasadams. The EO replied the caller that he will look into the suggestion.

Pilgrim caller Smt Satyabhama from Tirupati brought to the notice of EO to improve he quality of vermilion that is being distributed in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor. EO said the problem will be rectified soon.

One pilgrim caller Smt Gita from Saudi Arabia sought EO that she wanted to donate Rs.1cr toward setting up a hospital for TTD. The EO said she will be informed about the technical issues and feasibility involved in the issue by the concrned officials later.

Another caller Sri Lakshmipathi from Karvetinagaram brought to the notice of EO about the non performance of various rituals in Sri Venugoapal Swamy temple for which EO reacted the temple will be inspected soon to sort out all issues.

When Sri Raghavan from Chennai brought to the notice of the EO about the problems in the existing senior citizens line, the EO said this was the first complaint about this category darshan after necessary pilgrim friendly amendments and he will definitely solve he issues of transportation etc. meant for the pilgrims under this category.

58,419 ONLINE QUOTA OF ARJITHA SEVA TICKETS RELEASED

TTD has released 50,879 on-line quota of Arjitha Seva tickets for the month of July 2018. In this the quota of arjitha Seva tickets under electronic dip includes 9,619 out of which 6,979 are Suprabhatam, Thomala and Archana each 110, 120 Astadalam and 2300 Nija Pada Darshanam.

While the general category includes 48,800 tickets. Visesha Puja-1,000; Kalyanotsavam-12,350; Unjal Seva-3,900; Arjitha Brahmotsavam-7,150; Vasanthotsavam-8,800 and Sahasra Deepalankara Seva-15,600.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆన్‌లైన్‌లో 58,419 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల : డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఏప్రిల్‌ 06, తిరుమల 2018: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన జూలై నెల కోటాలో మొత్తం 58,419 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,619 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 6,979, తోమాల 110, అర్చన 110, అష్టదళపాదపద్మారాధన 120, నిజపాద దర్శనం 2,300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 48,800 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1000, కల్యాణం 12,350, ఊంజల్‌సేవ 3,900, ఆర్జితబ్రహ్మూెత్సవం 7,150, వసంతోత్సవం 8,800, సహస్రదీపాలంకారసేవ 15,600 టికెట్లు ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. సత్యభామ- తిరుపతి.

ప్రశ్న: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో నాణ్యమైన కుంకుమ ఇవ్వండి, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో అలకంకరణ బాగా చేయండి?

ఈ.వో. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో నాణ్యమైన కుంకుమ అందిస్తాం. శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయం జరుగుతోంది, మహాసంప్రోక్షణ అనంతరం స్వామిఅమ్మవార్లను అలంకరించి దర్శనం కల్పిస్తాం.

2. కమలేష్‌- హైదరాబాద్‌

ప్రశ్న: గోవిందమాలపై ప్రచారం చేయండి?

ఈ.వో. ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.

3. రాజు – హైదరాబాద్‌

ప్రశ్న: రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం భక్తులను కంపార్ట్‌మెంట్లలో కూర్చోబెడుతున్నారు?

ఈ.వో. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అరగంట వరకు భక్తులు వేచియుండాల్సి ఉంటుంది.

4.. జితేంద్ర – పశ్చిమగోదావరి, శ్రీనివాస్‌ – విశాఖ, శంకర్‌ – హైదరాబాద్‌, కృష్ణకుమార్‌ -హైదరాబాద్‌.

ప్రశ్న: ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ సేవా టికెట్లు దొరకడం లేదు, ఏకాంతసేవను ఆన్‌లైన్‌లో పెట్టండి?

ఈ.వో. నెలకు లక్ష మంది భక్తులు ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ సేవా టికెట్లకోసం నమోదు చేసుకుంటున్నారు. పోటీ ఎక్కువగా ఉంటుంది కావున తరుచూ ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు. ఏకాంతసేవను ఆన్‌లైన్‌లో పెట్టే అంశాన్ని పరిశీలిస్తాం.

5. లక్ష్మీపతి -కార్వేటినగరం.

ప్రశ్న: కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉత్సవాలు నిలిచిపోయాయి?

ఈ.వో. పరిశీలించి తగుచర్యలు తీసుకుంటాం.

6.. సూర్యకుమార్‌ – శ్రీరంగం.

ప్రశ్న: మహాద్వారం వద్ద తోపులాటను అరికట్టండిి?

ఈ.వో. మహాద్వారం వద్ద భక్తుల తోపులాటను అరికట్టేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం.

7. సురేష్‌ – నెల్లూరు

ప్రశ్న: తిరుమలలో దర్శన సౌకర్యం బావుంది. కంపార్ట్‌మెంట్లలో అల్పాహారంలో చట్నీని అందించండి?

ఈ.వో. తప్పకుండా అందిస్తాం.

8. శ్రీనివాస్‌్‌ – గుంటూరు.

ప్రశ్న: పీఏసీ-4లో స్నానపుగదులలో బకెట్‌లు, మగ్‌లు లేవు?

ఈ.వో. తనిఖీచేసి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం.

9. హనుమంతరావు – చిలకలూరిపేట

ప్రశ్న: కల్యాణకట్టలో డబ్బులు అడుగుతున్నారు, కంపార్ట్‌మెంట్లలో లడ్డూటోకెన్‌ కౌంటర్ల వద్ద చిల్లర సరిగా తిరిగి ఇవ్వడం లేదు, లడ్డూల రుచి తగ్గింది?

ఈ.వో. కల్యాణకట్టలో డబ్బులు అడుగుతున్న సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటున్నాం. మరింత నిఘా పెంచుతాం. లడ్డూ కౌంటర్ల వద్ద ఇకపై అలా జరుగకుండా చర్యలుతీసుకుంటాం. ప్రస్తుతం నాణ్యమైన లడ్డూలను అందిస్తున్నాం, మరోసారి పరిశీలిస్తాం.

10. కేశవన్‌ – నగరి

ప్రశ్న: శ్రీవారి మెట్టు వద్ద అన్నప్రసాద వితరణ చేయండి?

ఈ.వో. సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

11. చంద్రబాబు – చిత్తూరు

ప్రశ్న: తుంబురుతీర్థం వద్ద సరైన దారి ఏర్పాటు చేయండి?

ఈ.వో. అటవీప్రాంతం కావడంతో ఎలాంటి పనులు చేయలేకపోతున్నాం.

12. గీత – సౌదీ అరేబియా

ప్రశ్న: రూ.1 కోటితో ఆసుపత్రి నిర్మించి టిటిడికి ఇవ్వాలనుకుంటున్నా?

ఈ.వో. మిమ్మల్ని ఫోన్‌లో సంప్రదించి వివరాలు తెలియజేస్తాం.

13. సుబ్రమణ్యం – చెన్నై

ప్రశ్న: ఎస్వీబీసీలో బ్రహ్మాండేనాస్తికించన….. శ్లోకాన్ని పునరుద్ధరించండి, సహస్రదీపాలంకార సేవలో మరో అన్నమయ్య సంకీర్తన వినిపించండి, గోవిందం పరమానందం పుస్తకాన్ని తిరిగి ముద్రించి భక్తులకు అందించండి ?

ఈ.వో. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.

14. లోకేష్‌ – బెంగుళూరు

ప్రశ్న: దివ్యదర్శనం టోకెన్‌ విధానం చాలా బావుంది?

ఈ.వో. సంతోషకరం.

15. జివిఎస్‌ మూర్తి – హైదరాబాద్‌

ప్రశ్న: ఎస్వీబీసీలో వ్యాపార ప్రకటనలను అనుమతించకండి ?

ఈ.వో. అలాగే చేస్తాం.

16. కిరణ్‌కుమార్‌ – మార్కాపురం

ప్రశ్న: టిటిడి అన్యమతస్తులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, హిందూధర్మాన్ని మరింత ప్రచారం చేయండి?

ఈ.వో. టిటిడిలో అన్యమతస్తులకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను పాటిస్తాం. ధర్మప్రచారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాలలో 500 ఆలయాల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాం. ఏజెన్సీ ప్రాంతాలలో నాలుగుచోట్ల రూ.4.5 కోట్ల వ్యయంతో ఆలయాలు నిర్మిస్తున్నాం. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తదితర ప్రాజెక్ట్‌ల ఆధ్వర్యంలో ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నాం.

17. శ్రీరంగనాథన్‌ – చెన్నై

ప్రశ్న: డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని నెలకు రెండుసార్లు నిర్వహించండి, నాదనీరాజనం వేదిక వద్ద కళాకారులకు వసతులు కల్పించండి ?

ఈ.వో. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంతోపాటు కంపార్ట్‌మెంట్లలో రిజిస్టర్లను ఏర్పాటుచేసి భక్తుల నుండి సలహాలు, ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వీటితోపాటు టిటిడి కాల్‌సెంటర్‌, ఈమెయిల్‌, వాట్సాప్‌ తదితర మార్గాల ద్వారా భక్తులు తమ సూచనలను అందించవచ్చు. వీటిని పరిశీలించి పరిష్కార చర్యలు చేపడుతున్నాం.

18. రాఘవులునాయుడు – చెన్నై

ప్రశ్న: వృద్ధులు, దివ్యాంగుల టోకెన్ల జారీ కౌంటర్‌ వద్దకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది, ఆలయానికి దగ్గరగా ఏర్పాటు చేయండి ?

ఈ.వో. వృద్ధులు, దివ్యాంగుల టోకెన్ల జారీ కౌంటర్‌ వద్ద రవాణా తదితర సౌకర్యాలు కల్పించాం. మీ సూచనను పరిశీలిస్తాం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.