ONE CRORE TALAMBRALU DONATED _ శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ

Vontimitta, 21 April 2024: Sri Krishna Chaitanya Sangham president of East Godavari district Korukonda Sri Kalyana Apparao presented One crore Talambralu on Sunday for the Kalyanam of Sri Sitarama to be held at Vontimitta on Monday.  

These talambralu weighing 180 kg were presented at the temple in the presence of Deputy EO Sri Natesh Babu and Priest Sri Shravan Kumar.

For these Talambralu, paddy was grown especially for six months and the devotees from four states prepared it by husking it with finger nail for three months with great devotion.  

Sri Kalyana Apparao said that under the auspices of this association, they have been giving presentation to Bhadradri Rama for the past 13 years and Vontimitta Rama since last seven years on the occasion of Kalyanotsavam.

Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Naveen, other officials and a large number of devotees participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 21: ఒంటిమిట్టలో సోమవారం జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు శ్రీ కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను ఆదివారం సమర్పించారు. మొత్తం 180 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, అర్చకులు శ్రీ శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు.

ఈ తలంబ్రాల కోసం ఆరు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి నాలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తిభావంతో మూడు నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 13 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, ఏడేళ్లుగా ఒంటిమిట్ట రామునికి కల్యాణోత్సవం సందర్భంగా అందజేస్తున్నామని శ్రీ కళ్యాణ అప్పారావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ నవీన్, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది