ONLINE ADMISSION APPLICATIONS IN TTD DEGREE , JUNIOR COLLEGES _ టిటిడి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
Tirupati, 19 May 2018: Applications have been invited online for admissions to TTD degree and junior colleges for the academic year of 2018-19.
The applicants can also get information online about seats and also courses available etc in each college by logging onto the TTD website -www.admission.tirumala.org for SV Arts college, SPW degree college, SV Oriental college, SV Sangeet & Dance college etc and also at the SV Junior college and SPWJunior college.
The online applications should be made on or before May 27th for admissions in Degree and Junior colleges where merit list will be published by May 30. Counseling will be held from June 4 to June 9th at the SGS Arts college for all degree courses and SV Arts college for SV Arts colleges.
The classes for inter students will commence from June 11 and for degree students from June 12.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
మే 19, తిరుపతి 2018; టిటిడిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో 2018-19వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. విద్యార్థులు admission.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆయా కళాశాలల్లోని కోర్సుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
టిటిడిలో డిగ్రీ స్థాయి కోర్సులకు గాను ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల, ఎస్వీ ఓరియంటల్ కళాశాల, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియెట్ స్థాయిలో ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు జూనియర్ కళాశాల ఉన్నాయి.
టిటిడి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి మే 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 30న మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. జూన్ 4 నుంచి 9వ తేదీ వరకు డిగ్రీలో ప్రవేశాలకు ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాలలో, ఇంటర్‌లో ప్రవేశాలకు ఎస్‌వి ఆర్ట్స్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూన్ 11 నుండి ఇంటర్ విద్యార్థులకు, జూన్ 12వ తేదీ నుండి డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.