ONLINE GAMES AND WEBSITE OPERATORS IN TTDs NAME TO FACE LEGAL ACTION_ టీటీడీ పేరుతో ఆన్లైన్ గేమ్, వెబ్సైట్
Tirupati, 25 September 2021: TTD on Saturday warned of legal action against the person who is running Games Portal in the name of ‘ Tirupati Hill Climbing Racing Game” and “Tirupati bus driver” and also operating a website by the name “Digital Annamaiah”.
TTD CVSO Sri Gopinath Jatti said in a statement that the TTD vigilance inquiries showed that a person Sri Varadachari Suresh had designed an on-line game and uploaded in Google Play store in total violation of TTD regulations.
The CVSO warned that the accused is also managing a website on TTD’s name on which the TTD will take legal action.
He cautioned devotees and the general public not to be not carried away by them.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ పేరుతో ఆన్లైన్ గేమ్, వెబ్సైట్ – తయారు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు
తిరుపతి 25 సెప్టెంబరు 2021: తిరుపతికి చెందిన శ్రీ వరదాచారి సురేష్ అనే వ్యక్తి ‘ తిరుపతి హిల్ క్లైబింగ్ రేసింగ్ గేమ్ అండ్ తిరుపతి బస్ డ్రైవర్ ^ అనే పేరుతో ఆన్లైన్ లో గేమ్ తయారు చేయడంతో పాటు, ” డిజిటల్ అన్నమయ్య ^ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చిందని సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.
విజిలెన్స్ అధికారులు విచారణ జరపగా, నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ పేరుతో శ్రీ వరదాచారి సురేష్ అనే వ్యక్తి ఆన్లైన్ గేమ్ తయారు చేసి గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచారన్నారు. అలాగే వెబ్సైటు కూడా నిర్వహిస్తున్నట్లు నిరూపణ అయిందన్నారు. టీటీడీ పేరు ఉపయోగించుకుని ఇలాంటి ఆన్లైన్ గేమ్ లు, వెబ్సైట్లు నిర్వహిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సివిఎస్ఓ హెచ్చరించారు. ఇలాంటి ఆన్లైన్ గేమ్ లు, వెబ్సైట్లతో టీటీడీ కి ఎలాంటి సంబంధం లేదనే విషయం ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది