ONLINE REGISTRATION OF SRIVARI SEVA GARNERS HUGE RESPONSE FROM DEVOTEES_ ‘ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవ’ కు పెరుగుతున్న ఆదరణ

Tirumala, 17 January 2018: The on-line registration of Srivari Seva has been earning huge response from devotees who wish to render selfless services to fellow pilgrims not only from across the country but from abroad.

With an aim to encourage more number of youth to take part in the pilgrim services, under the instructions of TTD EO Sri Anil Kumar Singhal, in the direct supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju 3-day, 4-day and special occasion sevas have been introduced in on-online apart from 7-day service in Srivari Seva from November last onwards.

The online enrollment for Srivari Seva has been earning huge response especially for three day and four day as many employed and college going youth are keen to take part in this service. TTD also commenced two-day special occasion seva during last December for Vaikuntha Ekadasi, for which over 300 youth aged between 25years to 40years took part in this service and offered impeccable services to pilgrims. The sevakulu from New Delhi, Jharkand, West Bengal also took part in this two day service.

Seeing the response, TTD has opened up two-day special occasion slot for 300 youth to enroll online even for Rathasapthami which falls on January 24. So far 141 out of 300 have registered. The devotees who are willing to perform seva to the fellow pilgrims shall enroll online in this two day service individually with Aadhaar card. Those who have registered online should report in Srivari Seva Office located inside RTC bus complex in Tirumala on January 22and render service on 23 and 24 of January.

Meanwhile over 1600 sevakulu enrolled online for Rathasapthami in all forms of on-line seva including seven-day slot, four-day slot apart from special occasion slot.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

‘ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవ’ కు పెరుగుతున్న ఆదరణ

జనవరి 17, తిరుమల 2018: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తకోటికి మరింత ఉన్నత ప్రమాణాలతో పారదర్శకంగా సేవలందించడానికి విచ్చేస్తున్న శ్రీవారి సేవకుల కోసం టి.టి.డి ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ శ్రీవారి సేవలకు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది.

‘మానవసేవయే – మాధవసేవ’ అన్న లక్ష్యంతో 2000 సంవత్సరంలో టి.టి.డి ప్రవేశపెట్టిన శ్రీవారి సేవ 200 మంది శ్రీవారి సేవకులతో ప్రారంభమై గత 18 ఏళ్ళ ప్రస్థానంలో ఇప్పటి వరకు దాదాపు 8,34,544 శ్రీవారిసేకులు కోట్లాది మంది భక్తులకు విశేష సేవలందించారు. అయితే శ్రీవారి సేవకు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు శ్రీవారిసేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించడంలో భాగంగా టి.టి.డి యాజమాన్యం గత ఏడాది నవంబరు నుండి 7 రోజులు, 4 రోజులు, 3 రోజులు మరియు ప్రత్యేక పర్వదినాలలో సేవలను కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు వీలుగా ప్రవేశపెట్టింది. ఈ ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టిన శ్రీవారి సేవకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

రథసప్తమికి 2 రోజుల సేవ

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని టి.టి.డి. ఈ.ఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్వవేక్షణలో టి.టి.డి ఆన్‌లైన్‌లో ప్రత్యేక పర్వదినాలలో 2 రోజుల సేవను గత ఏడాది డిసెంబరు నెలలో ప్రవేశపెట్టింది. ఈ సేవలో 25 నుండి 40 ఏళ్ల లోపు ఉన్న యువజనులందరూ ఉత్సాహంతో ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకొని భక్తులకు విశేషసేవలందించారు. ఈ నేపథ్యంలో మరోమారు ఈ నెల రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మరో 300 మందికి (25 నుండి 40 ఏళ్ళ లోపువారికి) ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా ఆదార్‌ నెంబరుతో సేవకు నమోదు చేసుకొనే అవకాశం కల్పించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా 150 మంది భక్తులు నమోదు చేసుకున్నారు. ఇంకా దాదాపు 150 మంది సేవకులకు అవకాశం ఉన్నది. కాగా రథసప్తమి కొరకు 7 రోజులు, 4 రోజులు సేవలందించడానికి ఇప్పటి వరకు దాదాపు ఆన్‌లైన్‌ ద్వారా 1600 మందికి పైగా శ్రీవారి సేవకు నమోదు చేసుకోవడం విశేషం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.