PARUVETA PERFORMED IN SRI GT_ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

Tirupati, 17 January 2018: The annual Paruveta utsavam was performed with religious fervour in Sri Govinda Raja Swamy temple in Tirupati on Wednesday.
Every year this fete is being observed on the next day of Kanuma.

Lord Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi reached Paruveta Mandapam in Renigunta Road from the temple by 3:30pm and Asthanam was performed. The utsava murthies were brought back to the temple by 6pm.

Temple DyEO Smt Varalakshmi, Superintendent Sri Suresh, Temple inspector Sri Prasanth, archakas and devotees were also present.

ADHYAYANOTSAVAMS COMMENCES IN SRI GT

The adhyayanotsavams off to a great start in Sri Govinda Raja Swamy temple on Wednesday.

This annual fete will last for 24-days and conclude on February 9.

During these 24 days, Divya Prabandha Parayanam will be rendered in front of deities, Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi in Kalyanamandapam every day between 5:30pm and 6:30pm.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుపతి, 2018 జనవరి 17: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6.00 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి పి. వరలక్ష్మీ, సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ప్రశాంత్‌, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఇతర అధికార ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన అధ్యయనోత్సవాలు

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 17వ తేదీ బుధవారం అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు 24 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.

మాఘ మాసంలో ఈ ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా జనవరి 27న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 2న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 6న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.