ONLINE REGISTRATION SHOULD INCREASE IN HDPP-TTD EO_ హెచ్‌డిపిపి వెబ్‌సైట్‌లో భక్తుల నమోదును పెంచండి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirupati, 28 February 2019: The number of registrations in Hindu Dharma Prachara Parishad (HDPP) should be enhanced in on-line so that more number of devotees can take part in the religious programmes of TTD, instructed TTD EO Sri Anil Kumar Singhal to the concerned officials.
The IT meeting was held in the chambers’ of TTD EO Sri Anil Kumar Singhal on Thursday in TTD Administrative Building in Tirupati.
Reviewing the IT application recently developed for HDPP, he said, the web portal covered all the interesting details about Hindu Dharma Prachara activities and other important festivals that are being observed in various temples under the umbrella of TTD. “Take initiative to increase the online registrations in HDPP”, he directed.
Later he instructed the concerned to extend online booking facility for all TTD Kalyana Mandapams present in AP and TS from third week of March on wards.He directed the concerned to bring some quota of the rooms in Padmavathi Ammavari Nilayam (PAN) building which is opening shortly in Tiruchanoor also under online. The EO also reviewed on the IT application execution in TTD Education, Engineering, Accounts, Estate and other departments in TTD.
JEOs Sri KS Sreenivasa Raju, Sri B Lakshmikantham, FACAO Sri Balaji, IT Chief and GM Transport Sri Sesha Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
హెచ్‌డిపిపి వెబ్‌సైట్‌లో భక్తుల నమోదును పెంచండి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
ఫిబ్రవరి 28, తిరుపతి, 2019: హిందూ ధర్మప్రచార పరిషత్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునే భక్తుల సంఖ్యను పెంచాలని, తద్వారా మరింత ఎక్కువ మందిని ధర్మప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో గురువారం ఐటి విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన హెచ్‌డిపిపి వెబ్‌సైట్(hdpp.tirumala.org)లో అన్ని ధర్మప్రచార కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచారని, ఆసక్తి గల భక్తులు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని టిటిడి కల్యాణమండపాలను మాత్రమే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం ఉందని, మార్చి 3వ వారం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని టిటిడి కల్యాణమండపాలకు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాన్ని విస్తరిస్తామని తెలిపారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం యాత్రికుల వసతి సముదాయంలో అందుబాటులోకి రానున్న గదులకు కూడా ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా, విద్యావిభాగం, ఎస్టేట్, అకౌంట్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఐటి అప్లికేషన్ల పనితీరును ఈవో సమీక్షించారు.
ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ఇతర ఐటి అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.