ORGANISE AMMAVARI BRAHMOTSAVAMS ON PAR WITH SWAMYVARU-EO_ శ్రీవారి బ్రహ్మూెత్సవాల స్ఫూర్తితో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మూెత్సవాలను విజయవంతం చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirupati, 8 November 2017: There should not be any compromise in tge arrangements for the ensuing Padmavathi Ammavari brahmotsavams at Tiruchanoor and it should be on par with Tirumala brahmotsavams, asserted TTD EO Sri A.K.Singhal.
During the review meeting in the meeting hall on Wednesday evening along with JEO Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, Tirupati Urban SP Sri Abhishek Mohanty, District JC Sri Nishant Kumar, the EO said, all the illumination works should be completed by November 13 while the rangoli works in next three days.
The EO said at present there are 42 cameras in and around the temple and it should be enhanced during the Navahnika Karthika Brahmotsavams. There should be special security and traffic arrangements on the day of Panchami Theertham”, he said.
“All the vahana sevas should be live telecasted on SVBC and expert narrators should be selected to give narration on the importance of each vahana seva. All arjitha sevas are cancelled during these nine days”, he maintained.
All department HoDs were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి బ్రహ్మూెత్సవాల స్ఫూర్తితో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మూెత్సవాలను విజయవంతం చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
నవంబరు 08, తిరుపతి, 2017: తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాల స్ఫూర్తితో తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మూెత్సవాలను విజయవంతం చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లపై బుధవారం అధికారులతో ఈవో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నవంబరు 15 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మూెత్సవాల్లో భక్తుల అంచనాలకు తగ్గట్టు మెరుగ్గా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రత్యేకశ్రద్ధతో విద్యుత్ అలంకరణలు చేపట్టాలని సూచించారు. మూడు రోజుల్లో పెయింటింగ్, రంగోళిలు పూర్తి చేయాలన్నారు. తిరుపతిలోని ముఖ్యమైన కూడళ్లతోపాటు తిరుచానూరులో ఆర్చిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 42 సిసి కెమెరాలున్నాయని, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. పంచమితీర్థానికి ముందస్తుగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటుచేయాలన్నారు. భక్తుల భద్రత కోసం తిరుపతి ఆర్బన్ ఎస్పీ సహకారంతో పుష్కరిణిలోని 9 ప్రవేశమార్గాల్లో డిఎఫ్‌ఎండిలు ఏర్పాటుచేయాలన్నారు. పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లేందుకు తగినన్ని ఆర్‌టిసి బస్సులు ఉండేలా చూసుకోవాలన్నారు.
నవంబరు 13వ తేదీ నాటికి దేవతామూర్తుల కటౌట్లు తదితర విద్యుత్ అలంకరణలు పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. పాదరక్షలు, సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద భక్తులు సులువుగా గుర్తించేలా బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. వాహనసేవలు తిలకించేందుకు భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనసేవలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని, వ్యాఖ్యాతలకు ముందుగా పూర్తిగా అవగాహన కల్పించాలని అన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 5 రాష్ట్రాల నుంచి కళాబృందాలు విచ్చేసి వాహనసేవల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. తిరుచానూరులోని ఆస్థానమండపం, శిల్పారామం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రంలో ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. పుస్తక ప్రసాదం, మహిళలకు సౌభాగ్యం కింద కుంకుమ, గాజులు అందించాలన్నారు. వాహనసేవలు తిలకించేందుకు వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదాలు అందించాలని, పంచమితీర్థం రోజున పలు ప్రాంతాల్లో అల్పాహారం, అన్నప్రసాదాలు అందించాలని సూచించారు.
ప్రచారరథాల ద్వారా బ్రహ్మూెత్సవాలకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఈవో ఆదేశించారు. పరిశుభ్రత కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలని, భక్తుల వైద్యం కోసం డిస్పెన్సరీతోపాటు రెండు చోట్ల ప్రథమచికిత్స కేంద్రాలు, 3 అంబులెన్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తులకు డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో ఉంచాలని, భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకోవాలని పిఆర్వో డా|| టి.రవిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, అర్బన్ ఎస్పీ శ్రీ అభిషేక్ మహంతి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.