TIRUMALA JEO INSPECTS FOR PLACEMENT OF SD COUNTERS_ సర్వదర్శనం కౌంటర్ల కోసం స్థలాన్ని పరిశీలించిన జెఈవో
Tirumala, 8 November 2017: As the temple management has planned for time slot for sarva darshan (SD) pilgrims also, Tirumala JEO has inspected some places in Tirumala to set up SD counters along with Engineering officials.
The JEO inspected the area before PAC 2 Madhava Nilayam, Sannidhanam on Wednesday evening. He directed SE II Sri Ramachandra Reddy to set up as many counters as posaible at various places in Tirumala for the convenience of common pilgrims by first week of December.
VGO Sri Ravindra Reddy, EEs Sri Srinivasulu, Sri Ramakrishna, Sri Prasad, DE Electricals Smt Saraswati and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సర్వదర్శనం కౌంటర్ల కోసం స్థలాన్ని పరిశీలించిన జెఈవో
నవంబరు 08, తిరుమల, 2017: సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్ అమలుచేయాలని టిటిడి యాజమాన్యం నిర్ణయించిన నేపథ్యంలో టోకెన్ జారీ కౌంటర్ల కోసం జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించారు. మాధవనిలయంలోని పిఏసి-2, సన్నిధానం ఎదురుగా గల ప్రాంతాలను తనిఖీ చేశారు.
సర్వదర్శనం భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో డిసెంబరు మొదటివారంలోపు టోకెన్ జారీ కౌంటర్లు ఏర్పాటుచేయాలని టిటిడి ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డిని జెఈవో ఆదేశించారు. జెఈవో వెంట విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఇఇలు శ్రీ శ్రీనివాసులు, శ్రీరామకృష్ణ, శ్రీ ప్రసాద్, డిఇ(ఎలక్ట్రికల్) శ్రీమతి సరస్వతి ఇతర అధికారులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.