ORISSA’S TOP BRASS OFFICIALS VISIT TIRUMALA TO STUDY PILGRIM AMENITIES_ శ్రీవారి ఆలయ నిర్వహణ, టిటిడి పాలనపై ఒడిశా అధికారుల అధ్యయనం వివరాలు తెలియజేసిన టిటిడి ఈవో, తిరుమల జెఈవో

Tirupati, 20 August 2018: The management of TTD takes care of both it’s administrative set up and amenities of multitude of pilgrims visiting Tirumala temple in a balancing way, said TTD EO Sri Anil Kumar Singhal.

A formal meeting by EO with the higher officials from Government of Orissa along with senior officers of TTD was held in Sri Padmavathi Rest House in Tirupati on Monday.

The EO elaborated the top brass officers from Orissa on the effective management of Queue line system in Tirumala, sanitation, hereditary archakas, strong work force of TTD, sanitation, Vigilance and Security measures etc.

Earlier during the day, the team comprising of Sri Mahapatra, IAS, Additional Chief Secretary, Sri Priyadarsi, IPS, IG, Sri Tripathi, administrator, Puri Jagannath temple from Orissa inspected various core areas in Tirumala on Monday for over four hours.

The parakamani activity was explained By Tirumala JEO Sri KS Sreenivasa Raju. Later they visited potu, Annaprasadam Complex, Vaikuntham Queue Complex, Laboratory, Srivari Seva new buildings etc.

The concerned officials elaborated on each and every aspect in length. They also observed the various services that are being rendered by Srivari Seva volunteers in various departments and appreciated their services.

Temple DyEO Sri Harindranath, Health Officer Dr Sermista, Catering Officer Sri Shastry, VGO Sri Ravindra Reddy, DFO Sri Phani Kumar Naidu, EE FMS Sri Mallikarjuna Prasad, APRO Ms.Neelima were also present.

Later in the evening the team visited coins parakamani in TTD administrative building in Tirupati. FACAO Sri Balaji was present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయ నిర్వహణ, టిటిడి పాలనపై ఒడిశా అధికారుల అధ్యయనం వివరాలు తెలియజేసిన టిటిడి ఈవో, తిరుమల జెఈవో

ఆగస్టు 20, తిరుపతి, 2018: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఒడిశా రాష్ట్రం పూరిలోని శ్రీ జగన్నాథస్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ అధికారులు సోమవారం తిరుమల శ్రీవారి ఆలయ నిర్వహణ, టిటిడి పాలనావ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేశారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు వీరికి వివరాలను తెలియజేశారు. ఈ ఉన్నతస్థాయి కమిటీలో ఒడిశా అదనపు ముఖ్య కార్యదర్శి శ్రీ ఎస్‌.సి.మహాపాత్ర, ఐజి శ్రీ ఎస్‌.కె.ప్రియదర్శి, శ్రీ జగన్నాథ ఆలయ కమిటీ సభ్యుడు శ్రీ ఎం.త్రిపాఠి ఉన్నారు.

తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతిగృహంలో సోమవారం మధ్యాహ్నం ఈ కమిటీ సభ్యులతో ఈవో సమావేశమయ్యారు. ఇందులో శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల నిర్వహణ, తిరుమలలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం, ట్రస్టులు, పథకాలు, ధర్మప్రచార కార్యక్రమాలు, ఎస్వీబీసీ, గోశాల, వసతి కల్పన, నిఘా, భద్రతా వ్యవస్థ, వంశపారంపర్య, ఇతర అర్చకుల ఎంపిక, ఉద్యోగుల ఎంపిక, విధులు నిర్వహణ తదితర అంశాలపై ఈవో తెలియజేశారు. ఆ తరువాత టిటిడి పరిపాలనా భవనంలోని నాణేల పరకామణి, ఖజానా విభాగాలను కమిటీ సభ్యులు పరిశీలించారు.

కాగా, సోమవారం ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యాకాంప్లెక్స్‌, శ్రీవారి ఆలయం, పరకామణి, లడ్డూల తయారీ, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవా విధానం, శ్రీవారి సేవకుల కోసం నిర్మిస్తున్న నూతన భవనాలు తదితరాలను ఉన్నతస్థాయి కమిటీ అధికారులు పరిశీలించారు. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు కమిటీ సభ్యులకు సమాచారం అందించారు.

ఈ కార్యక్రమాల్లో టిటిడి డిఎల్‌వో శ్రీ రమణనాయుడు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, కమిటీ నోడల్‌ అధికారి, డిఎఫ్‌వో శ్రీఫణికుమార్‌ నాయుడు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఎఫ్‌ఎంఎస్‌ ఇఇ శ్రీ మల్లికార్జునప్రసాద్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.