TTD PUBLICATIONS TO ALL LIBRARIES IN STATE-EO_ గ్రంథాలయాలకు టిటిడి ఆధ్యాత్మిక పుస్తకాలు అందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 20 August 2018: To enhance spiritual fervour among the people of the state, TTD EO Sri Anil Kumar Singhal directed Tirupati JEO Sri P Bhaskar to provide TTD publications free of cost to all the libraries located in AP.

Senior officers review meeting was held in the chambers of TTD EO in the administrative building in Tirupati on Monday. The EO asked JEO to come out with an action plan to implement the same soon. He directed to keep a proposal for the same to discuss in the board meeting.

The EO also instructed the concerned to ensure that Sapthagiri magazine copies reach it’s 1.80lakh subscribers on time.

Later he instructed the engineering officials to ensure light and fresh air in the additional parakamani hall where Yagashala for Maha Samprokshanam was built. He directed the engineers to complete the Ugranam works in Tirumala by the end of the month.

The EO instructed PRO Dr T Ravi to submit a survey report on the quality of mini laddu prasadam being distributed to Pilgrims after darshan. He also directed him to ensure the complaints lodged in call centres reach the concerned heads and get resolved without delay.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P.Bhaskar, CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji, DLO Sri Ramana Naidu were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

గ్రంథాలయాలకు టిటిడి ఆధ్యాత్మిక పుస్తకాలు అందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఆగస్టు 20, తిరుపతి, 2018: ప్రజలలో భక్తిభావం, ధార్మికతను మరింత పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు టిటిడి ఆధ్యాత్మిక పుస్తకాలను అందించాలని, దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ధర్మకర్తల మండలికి సమర్పించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తిరుపతి జెఈవోను కోరారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోగల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి వివిధ భాషలలో ఆధ్యాత్మిక పుస్తకాలను ముద్రిస్తోందని, వీటిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న గ్రంథాలయాలకు ఉచితంగా అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సప్తగిరి మాసపత్రికకు ఒక లక్షా 80 వేలకు పైగా పాఠకులు ఉన్నారని, వీరికి సకాలంలో పత్రిక అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ సందర్భంగా పాత కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన యాగశాల ప్రాంతంలో గాలి, వెలుతురు ఉండేలా చూడాలని, సువాసనలు వెదజల్లేలా హెర్బల్‌ పేస్ట్‌ను అంటించాలని అన్నారు.

తిరుమలలో నిర్మాణంలో ఉన్న ఉగ్రాణం భవనాన్ని ఈ నెలాఖరుకు సిద్ధం చేయాలని, ఇక్కడ అవసరమైన భద్రతా పరికరాలను ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. తలనీలాల ప్యాకింగ్‌కు సంబంధించి నాణ్యమైన సంచులను సమకూర్చుకోవాలన్నారు. శ్రీవారి దర్శనానంతరం ప్రసాదంగా ఇస్తున్న చిన్న లడ్డూల నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను సేకరించాలని, కాల్‌ సెంటర్‌ ద్వారా భక్తులు చేస్తున్న సూచనలు, సలహాలు, ఫిర్యాదులను సంబంధిత శాఖాధిపతుల దృష్టికి తీసుకురావాలని ప్రజాసంబంధాల అధికారిని ఆదేశించారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్ద భక్తులకు అవసరమైన పార్కింగ్‌ ప్రాంతాన్ని గుర్తించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, డిఎల్‌వో శ్రీ రమణనాయుడు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.