OUR PRIME FOCUS IS ON PILGRIM INITIATIVES WITH TRANSPARENCY-TTD EO_ టిటిడి ఈవో గణతంత్ర దినోత్సవ ప్రసంగ పాఠం

R-DAY FETE OBSERVED WITH PATRIOTIC FERVOUR

Tirupati, 26 January 2018: The prime focus of TTD is on introducing more and more transparent pilgrim initiatives, asserted TTD EO Sri Anil,Kumar Singhal.

After hoisting the National Flag and offering salutations, in his Republic Day address in the Parad Grounds behind TTD administrative building in Tirupati on Friday, the EO recalled the sacrifices and dedication of great leaders who achieved freedom and Republican status to India with their tireless efforts.

“Following their footsteps we should offer the best possible services to our pilgrims and make them feel comfortable which is our prime responsibility. The successful conduct Brahmotsavams, Vaikuntha Ekadasi during last year and the very recent Radhasapthami implies the dedicated team work of strong workforce. I anticipate the same spirit and enthusiasm in future too”, he added.

Some excerpts from the speech of Executive Officer.

@ Performance of rituals and kainkaryams as per the norms of Agama on the advice of Agama Advisors
@ Top priority to common devotees in darshan
@ Retractable roof inside Tirumala temple as a protective shield to the pilgrims during inclement weather conditions
@ Hi-if CC cameras to be installed in Tirumala soon
@ Slotted Sarvabhupala Darshan (SSD) counters to be set up in Tirumala and Tirupati soon
@ Improvements in pilgrim services based on pilgrim feed back in VQC gathered by Srivari Sevakulu
@ Stabilised Divya Darshan system by issuing 14000 tokens in Alipiri and 6000 tokens in Srivarimettu footpaths
@ Preparation of additional 50,000 laddus
@ IT initiatives including e-Office, e-Hundi, e-Donation, launching of mobile app, website in Telugu, Tamil and Hindi also
@ On-line booking of TTD Kalyana Mandapams
@ Lucky dip of arjita seva tickets
@ FMS call centre set up to receive the complaints related to accommodation that functions 24X7
@ Temples to be developed in Tiruchanoor, Mangapuram and also at Vontimitta
@ New Venkateswara Swamy temples coming at a cost of Rs.18crores in Rampachodavaram, Parvathipuram, Seetampeta, Araku agency areasand also in Visakhapatnam and Bhuvaneswari
@ In the next three months time, construction of temples will be completed at Kanyakumari, Rishikesh and Hyderabad
@ 36 dilapidated age old temples under Endowments department to get facelift at a cost of Rs.7crores
@ Bhajana Mandirs to be constructed at a cost of Rs.40crores in SC, ST and BC areas
@ Development of Sri Venkateswara temple at Nimmakuru and Sri Seshachala Lingeswara Swamy temple in Kandulavaripalle
@ Apart from 7-day Srivari seva, four day, three day and special occasion seva through online has also been introduced
@ Beautification of Tirupati city, Avilala tank, Sky Walk over bridge construction
@ Tirupati to be developed as a “Medical Hub”
@ Online sale of Diairies and calendars


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడి ఈవో గణతంత్ర దినోత్సవ ప్రసంగ పాఠం

తిరుపతి, 2018 జనవరి 26: భారతదేశ చరిత్రలో 1950, జనవరి 26 భారతీయులందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అతిముఖ్యమైన రోజు అని శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్ఘాటించారు. టిటిడి గణతంత్ర దినోత్సవ సందేశం ఈవో మాటల్లోనే…భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర(రిపబ్లిక్‌) ప్రతిపత్తి వచ్చింది. భిన్నత్వాన్ని కాపాడుకునే విధంగా రాజ్యాంగ నిర్మాతలు ”పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, సమాఖ్య విధానం, సామాజిక, ఆర్థికన్యాయం” మొదలైన వాటిని రాజ్యాంగ మౌలిక లక్షణాలుగా వర్ణించారు. ఇంతటి విశిష్టమైన రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్న మహనీయులందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానముల అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, భద్రతాసిబ్బందికి, విశ్రాంత సిబ్బందికి, పాత్రికేయులకు 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

శ్రీవారి ఆలయం :

– తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర టిటిడి ఆలయాలలో బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి లాంటి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాం. ఈ ఉత్సవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

– ముఖ్యంగా ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు కనువిందు చేసేలా బ్రహ్మోత్సవాల సమయంలో మెరుగైన ప్రదర్శనలిచ్చేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన నైపుణ్యం గల కళాబృందాలను ఆహ్వానిస్తున్నాం.

– నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన సామాన్య భక్తులకే మొదట దర్శన సౌకర్యం కల్పించాం. ఇదేతరహాలో రానున్న రోజుల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తెలియజేస్తున్నాను.

– తిరుమల శ్రీవారి ఆలయంలో సహజ శిల్ప సౌందర్యం, ఆలయ శోభను కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించేందుకు వీలుగా ముడుచుకునే పైకప్పు(రిట్రాక్టబుల్‌ రూఫ్‌)ను ఏర్పాటు చేస్తున్నాం. అంతేగాకుండా భక్తులకు ఆలయంలో ఎండకు, వర్షానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

– శ్రీవారి ఆలయం మరియు టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు,ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం.

భక్తుల అభిప్రాయ సేకరణ :

– వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తుల నుంచి శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయసేకరణ చేపడుతున్నాం. భక్తుల సూచనలను పరిగణలోకి తీసుకుని మెరుగైన సేవలు అందిస్తున్నాం.

లడ్డూ ప్రసాదం :

– భక్తుల కోరిక మేరకు తిరుమలలో లడ్డూల కొరత లేకుండా చూసేందుకు ఒక రోజుకు అదనంగా 50 వేల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నాం.

టైంస్లాట్‌ :

– ఇప్పటికే కాలినడకన శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఒక రోజుకు 20 వేల టోకెన్లు టైమ్‌స్లాట్‌ ప్రకారం జారీ చేస్తున్నాం. ఈ పద్ధతి ద్వారా భక్తులు నిర్దేశించిన సమయంలోనే స్వామివారిని దర్శించుకుంటున్నారు.

– ఇదే తరహాలో భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేందుకు డిసెంబరు 18 నుంచి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా టైంస్లాట్‌ పద్ధతిని అమలుచేశాం. ఈ విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.

– మార్చి నెల నుంచి తిరుమలతోపాటు తిరుపతిలోనూ పూర్తిస్థాయిలో ఈ ధానాన్ని అమలుచేస్తాం.

ఆధునిక భద్రతా పరికరాలు :

– భక్తుల భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆధునిక సిసి కెమెరాలను ఏర్పాటుచేస్తున్నాం. కామన్‌ కమాండ్‌ సెంటర్‌ ద్వారా ఈ సిసి కెమెరాలతో నిత్యం భద్రతను పర్యవేక్షిస్తాం. మొదటి దశలో శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో సిసి కెమెరాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.

ఐటి సేవలు :

– రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టిటిడిలో మరింత పారదర్శక పాలన కోసం ఈ-ఆఫీస్‌ విధానాన్ని అమలుచేస్తున్నాం

– ttdsevaonline.com వెబ్‌సైట్‌ ద్వారా తెలుగు, ఇంగ్లీషు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సేవల సమాచారాన్ని భక్తులకు అందుబాటులో ఉంచాం.

– ఇందులో ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల బుకింగ్‌, ఆర్జితసేవల ఎలక్ట్రానిక్‌ డిప్‌, కల్యాణవేదిక, ప్రచురణలు, ఈ-హుండీ, ఈ-డొనేషన్‌, కాటేజి డొనేషన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

కల్యాణమండపాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ :

– పవిత్రమైన రథసప్తమి పర్వదినం నాడైన జనవరి 24వ తేదీ నుంచి కల్యాణమండపాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రారంభించాం. తొలిదశలో ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోని 39 కల్యాణమండపాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. పోస్టాఫీసుల్లోనూ వీటిని బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాం.

ఆర్జితసేవల లక్కీడిప్‌ :

– శ్రీవారి ఆర్జితసేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌నకు భక్తుల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తోంది. నెలవారీ విడుదల చేసే ఈ లక్కీడిప్‌కు లక్ష మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు.

– టిటిడిలోని వివిధ ట్రస్ట్‌లకు డొనేషన్‌ అందించినవారికి అక్నాలెడ్జ్‌మెంట్‌, పన్ను మినహాయింపు పత్రాలు ఆన్‌లైన్‌ విధానం ద్వారా అందిస్తున్నాం. విరాళాలు టిటిడి ఖాతాలో జమ అయిన వెంటనే ఈ-పాస్‌బుక్‌ జారీ చేస్తున్నాం.

టిటిడి క్యాలెండర్లు, డైరీలు :

– 2018వ సంవత్సరానికి సంబంధించి 37 లక్షల క్యాలెండర్లు, 12 లక్షల డైరీలు ముద్రించాం. వీటి విక్రయాలు పూర్తి కావస్తున్నాయి. తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. పోస్టల్‌ విభాగం ద్వారా క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందిస్తున్నాం.

ఎఫ్‌ఎంఎస్‌ కాల్‌సెంటర్‌ :

– తిరుమలలో గదులు పొందిన భక్తులకు ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఎఫ్‌ఎంఎస్‌ కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేశాం.

ఆలయాల అభివృద్ధి :

– టిటిడి అనుబంధ ఆలయాలకు విచ్చేస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేదిశగా కృషి చేస్తున్నాం.

– రానున్న మూడు నెలల కాలంలో కన్యాకుమారి, కురుక్షేత్రలో దివ్యక్షేత్రాల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.

– ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, రంపచోడవరం, పార్వతీపురం, శీతంపేటలో రూ.18 కోట్లతో శ్రీవేంకటేశ్వర దివ్యక్షేత్రాల నిర్మాణానికి అనుమతిచ్చాం.

– విశాఖపట్నం, భువనేశ్వర్‌లోనూ దివ్యక్షేత్రాలు నిర్మిస్తాం.

– రూ.7 కోట్ల వ్యయంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అత్యంత పురాతనమైన 36 ఆలయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం.

– రూ.40 కోట్ల ఖర్చుతో ఎస్‌సి, ఎస్‌టి, బిసివర్గాల నివాస ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణం చేపడుతున్నాం.

– రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టిటిడి పరిధిలోకి తీసుకున్న నిమ్మకూరులోని శ్రీ వేంకటేశ్వరాలయం, కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయం అభివృద్ధికి చర్యలు చేపట్టాం.

– ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో రూ.20 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను రానున్న బ్రహ్మోత్సవాలలోపు పూర్తి చేస్తాం.

ధర్మప్రచారం :

– హిందూ ధర్మప్రచార పరిషత్తు ద్వారా మనగుడి, శ్రీనివాసకల్యాణాలు, శుభప్రదం, సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సనాతన హైందవ ధర్మ ప్రచారం చేస్తున్నాం.

– అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, పుస్తకప్రచురణల విభాగం, శ్రీ వేంకటేశ్వర భక్తిఛానల్‌, ఇతర ప్రసారమాధ్యమాల సహకారంతో శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేస్తున్నాం.

– 2017, సెప్టెంబరు నుంచి ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు నెలకు 2 బ్యాచ్‌ల చొప్పున అర్చక శిక్షణ ఇస్తున్నాం.

పేద రోగులకు వైద్యసేవలు :

– తిరుపతిలో భక్తులకు, టిటిడి ఉద్యోగులకు నేత్రవైద్యసేవలు అందించేందుకు గాను ప్రముఖ అరవింద నేత్ర వైద్యశాలను, క్యాన్సర్‌ వ్యాధి నివారణ కోసం టాటా క్యాన్సర్‌ ఆసుపత్రిని టిటిడి సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం.

విద్య :

– టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నాం. తద్వారా చదువు పూర్తికాగానే ఉపాధి పొందేందుకు వీలవుతుంది.

తిరుపతి సుందరీకరణ :

– భక్తుల కోసం అవిలాల చెరువును ఆధ్యాత్మిక పార్కుగా తీర్చిదిద్దుతాం. అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకు రూ.28 కోట్లతో 4 రోడ్ల అభివృద్ధి పనులు, అదేవిధంగా, రూ.8 కోట్లతో రైల్వేస్టేషన్‌ నుంచి బస్టాండు వరకు స్కైవాక్‌ (skywalk) బ్రిడ్జి నిర్మాణం చేపడతాం.

– అలిపిరి, అవిలాల, రేణిగుంట వద్ద గల కెఎల్‌ఎం జంక్షన్‌, ఉప్పరపల్లె, చెర్లోపల్లె జంక్షన్‌ల అభివృద్ధి పనులకు రూపొందించిన ప్రణాళికలను త్వరలో అమలుచేస్తాం.

శ్రీవారి సేవ :

– శ్రీవారి సేవలో గడిచిన 17 సంవత్సరాల్లో ఇప్పటివరకు 8 లక్షల మందికి పైగా సేవకులు పాల్గొని భక్తులకు విశేష సేవలందిస్తున్నారు.

– ఎక్కువ మందిని శ్రీవారి సేవలో భాగస్వాములను చేసేందుకు వీలుగా 7 రోజులు, 4 రోజులు, 3 రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 2 రోజుల స్లాట్లను ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టాం. అదేవిధంగా వృత్తిపరంగా నైపుణ్యం గలవారు కూడా సేవలో పాల్గొనేందుకు వీలుగా అప్లికేషన్‌ తయారు చేస్తున్నాం.

ముగింపు :

– భక్తులకు చక్కటి సేవలు అందిస్తున్న నా సహచర ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు అభినందనలు.

– టిటిడి ఆలయాల్లో జరుగుతున్న ఉత్సవాలు, ఇతర కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తకోటికి అందిస్తున్న మీడియా మిత్రులకునా హృదయపూర్వక కృతజ్ఞతలు.

– రాబోయే రోజుల్లో ఆధునిక టెక్నాలజీ సహకారంతో భక్తులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.

– ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆ శ్రీనివాసుని నిండైన ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను…. జైహింద్‌

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.