136 EMPLOYEES RECEIVE BEST SERVICE MEDALS_ టిటిడి పరిపాలనా భవనంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
CULTURAL PROGRAMMES FIESTA DURING R-DAY
Tirupati, 26 January 2018: It’s been a grand fiesta of cultural programmes which stood as special attraction during the Republic Day celebrations in Tirupati on Friday in Parade Grounds of TTD.
The march by the security sleuths of TTD provided a patriotic atmosphere followed by the dance performances by the students of various TTD-run schools for some famous patriotic songs.
Later the TTD EO Sri Anilkumar Singhal along with JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar and CVSO Sri A Ravikrishna offered medals to 15 officers and 121 employees of TTD for their best services. The certificate of Appreciation have been given away to another 74 staff concerned with e-Office.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
టిటిడి పరిపాలనా భవనంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
తిరుపతి, 2018 జనవరి 26: టిటిడి పరిపాలనా భవనంలో శుక్రవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 121 మంది ఉద్యోగులు, 15 మంది అధికారులకు 5 గ్రాముల వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు ”ఎగిరింది ఎగిరింది ఎర్రకోటపై జెండా…” అనే గీతానికి ఆకట్టుకునేలా నృత్యప్రదర్శన చేశారు. శ్రీగోవిందరాజస్వామి ఉన్నతపాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థిని విద్యార్థులు ”మా తుఝే సలాం… వందేమాతరం…” గీతానికి దేశభక్తి ఉట్టిపడేలా నృత్యం చేశారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 19 మంది విద్యార్థినులు ”వందేమాతరం…” గీతానికి చక్కటి నృత్యాభినయం చేసి అలరించారు.
అంతకుముందు జరిగిన భద్రతా సిబ్బంది కవాతుకు ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. కవాతులో పాల్గొన్న శ్రీ రామకృష్ణ నేతృత్వం వహించిన టిటిడి సెక్కూరిటీ దళానికి మొదటి బహుమతి లభించింది. ఎస్‌ఐ శ్రీ భార్గవ నేతృత్వంలోని ఎస్‌పిఎఫ్ దళానికి రెండవ, శ్రీ శశికుమార్ నేతృత్వంలోని ప్రయివేటు సెక్యూరిటీ దళానికి మూడవ, బ్యాండ్ మాస్టర్ శ్రీ బసవయ్య నేతృత్వంలోని బ్యాండ్‌కు నాలుగవ బహుమతులు లభించాయి.
ఈ సందర్భంగా టిటిడిలో ఈ-ఆఫీస్ విధానాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు కృషి చేసిన 74 మంది సిబ్బందికి ఈవో చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, డిఎల్‌వో శ్రీ ఎంవి.రమణనాయుడు, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ బాలాజి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, విజిఓ శ్రీ అశోక్‌కుమార్ గౌడ్, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీమతి గౌతమి అన్ని విభాగాల అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.