OVER 3000 DASAPARAS TAKE PART IN METLOTSAVAM_ వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం
Tirupati, 10 Jan. 18: The sacred Alipiri foot hills was abuzz with activity on Wednesday with over 3000 dasaparas trekking the 3600 plus steps singing the melodious bhajans of Kannada Haridasas.
Speaking on this occasion near Alipiri Padala Mandapam before commencing the sacred walkathon with Metlpuja during wee hours, the Special officer of Dasa Sahitya Project Sri PR Anandateerthacharya said, many saints, seers, philosophers, emperors earlier trekked this way and attained salvation. To continue their legacy, the Dasa Sahitya Project of TTD has been observing Metlotsavam every three months in a year from the past many years without interruption.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం
అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లపూజ
తిరుపతి, 2018 జనవరి 10: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్య ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ పవిత్రమైన ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టిటిడి మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.
అంతకుముందు భజనమండళ్ల భక్తులు టిటిడి మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 3200 మందికిపైగా భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.