ADHYAYANOTSAVAMS TO CONCLUDE ON JAN 11_ జనవరి 11వ తేదీ శ్రీవారి ఆలయంలో ముగియనున్న అధ్యయనోత్సవాలు
Tirumala, 10 Jan. 18: The 25-day Adhyayanotsavams will conclude on January 11 with Tanniramudu Utsavam in the holy Dhanur Masam in Tirumala temple.
The Veda pundits will recite the 4000 pasurams of Alwar Divya Prabandham in front of Sri Malayappa Swamy and His Consorts in Ranganayakula Mandpam.
On the next day on January 12, the processional deities will be taken to Sri Tirumala Nambi temple located in South Mada Street.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జనవరి 11వ తేదీ శ్రీవారి ఆలయంలో ముగియనున్న అధ్యయనోత్సవాలు
జనవరి 10, తిరుమల 2018: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు గత ఏడాది డిశెంబరు 18 తేదీన ప్రారంభమై ఈ ఏడాది జనవరి 11వ తేదీ గురువారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు రాత్రి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహిస్తున్నారు.
గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీ వైష్ణవ జీయంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదిస్తున్నారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను శ్రీవైష్ణవులు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పారాయణం చేన్నారు.
కాగా గురువారం నాడు అధ్యయనోత్సవాలలో చివరి రోజు కావడంతో ”తన్నీరముదు” ఉత్సవంతో ముగియనున్నయి. అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటి రోజు అనగా జనవరి 12న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయానికి వేంచేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.