OVERCOME YOUR SENSES BY RECITING BHAGAVAT GITA-SO ALL PROJECTS_ భగవద్గీత పఠనం ద్వారా ఇంద్రియాలను జయించవచ్చు శ్రీ ముక్తేశ్వరరావు

Tirupati, 14 July 2017: TTD Special Officer for All Projects Sri N Muktheswara Rao advocated that Bhagavat Gita teaches the righteous way of leading life and we can control our emotions and senses by chanting the Gita slokas everyday, he maintained.

Two-day Bhagavat Gita – Adhyayanam programme took place in SPWD and PG college in Tirupati on Friday. Addressing the inaugural day programme as chief guest Sri Muktheswara Rao said, “Gita is Veda of Life. It is an incredible teaching by Lord Himself which gives solutions to all our problems. It shows us way to live our life effectively in the most pious manner”, he maintained.
Earlier faculty and students recited slokas from Gita.

College Vice-Principal Dr Mahadevamma, Telugu Department HoD Dr Krishnaveni and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భగవద్గీత పఠనం ద్వారా ఇంద్రియాలను జయించవచ్చు శ్రీ ముక్తేశ్వరరావు

తిరుపతి, 2017 జూలై 14: భగవద్గీతను విద్యార్ధి దశ నుండి పఠించడం ద్వారా ఇంద్రియాలను అదుపు చేసుకుని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ముక్తేశ్వరరావు తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ మరియు పిజి కళాశాలలో శుక్రవారం ”భగవద్గీత – అధ్యయనం” పై రెండు రోజుల పాటు విద్యార్ధినులకు శిక్షణ కార్యక్రమంను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవత్‌ గీత జీవన వేదమన్నారు. నిరాశ, నిస్పృహల్లోని అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేయడానికి శ్రీ కృష్ణుడు అందించిన సందేశమే భగవద్గీత అని తెలిపారు. అనంతరం కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డా|| మహదేవమ్మ ప్రసంగిస్తూ యవ్వన దశ నుండే భగద్గీతను పఠించడం అలవరుచుకోవాలని, అదే ముక్తి దాయకమన్నారు. విద్యార్థులు భగవద్గీతలోని అంతర మూలాన్ని గ్రహించాలన్నారు. తెలుగు విభాగాధిపతి డా|| కృష్ణవేణి ప్రసంగిస్తూ భగవద్గీత చదవటం వలన ధైర్యం, మనపై మనకు నమ్మకం, కలుగుతాయన్నారు. త్రిగుణాల గురించి తెలుసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చన్నారు.

అనంతరం శిక్షణా కార్యక్రమంలో భాగంగా భగవద్గీతలోని శ్లోకాలను అధ్యాపకులు, విద్యార్ధినులు నేర్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి రామతులసి, శ్రీమతి నీరజ, డా||గురవారెడ్డి, ఇతర అధ్యాపకులు, విద్యార్ధినులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.