OVER FLOWING DEVOTEES AT NARAYANAGIRI Q LINE FOR V DAY DARSHAN_ భక్తులతో కిటకిటలాడుతున్న నారాయణగిరి ఉద్యానవనాలు

CONTINUOUS SUPPLY OF ANNAPRASADAMS AND DRINKING WATER

BHAJANS AND BHAKTHI SANGEET TO KEEP DEVOTEES ENGAGED

Tirumala, 28 December 2017: Tirumala is flooded with devotees on Thursday evening for the holy darshan of Lord Venkateswara on the auspicious day of Vaikunta Ekadasi on Friday.

As of evening today VQC complex, temporary sheds at ANC and Narayanagiri Gardens were already swelling with devoees who had come prepared for spending the night for tomorrows darshans. TTD had rolled out Annaprasadam, drinking water, Tea, Coffee and milk for the thousands of devotees waiting in all the queue lines in Tirumala.

The HDPP wing of TTD has organised special bhakti sangeet and bhajan programs around the queue lines for the night and the FM radio and the Broadcasting wing of TTD had been providing information on time for darshan in compartments, queue lines outside and accomodation available for the devotees. Additional mobile toilets and cleaning of Tirumala on 24×7 basis is also orgaised by the health wing of TTD. The TTD medical wing has also set up additional dispensaries and first aid centres across Tirumala to attend to devotees emergency needs.

Srivari Sevaks and Scouts & Guides were engaged in large number to serve the devotees at all locations on Tirumala.

SWARNA RATHOTSAVAM ON DEC 29: At 9am-11am on Vaikunta Ekadasi day the TTD has organised Swarna Rathotsavam at Tirumala and similarly Chakrasnanam of Sri Sudarshana Chakrathalvar at Swami Pushkarni at early hours of 4.30am to 5.30 AM.

SIGNIFICANCE OF VAIKUNTA EKADASI: The Ekadasi on Shukla paksham of Dhanurmasam is regarded as the Vaikuna Ekadasi or Mukkoti Ekadasi.

Legends say that the devotees who witness the Swarna Rathotsavam after the Darshan of Lord Venkateswara on that day are said to beget punya of performing three crore Ekadasi. They also beget the fruits of bathing in all the punya thirthas of Thirumala if they take bath at the muhurtam of Chakrasnanam in the Swami Pushkarini, say Puranas.

VAIKUNTA DWARA DARSHAN: From Suprabatham on Vaikunta Ekadasi to late night Ekanta seva of Vaikuna dwaasi on Saturday the Vaikunta dwaram on the northern direction of the Srivari temple will be kept open once a year. The Vaikunta pradakshinam bedecked with glittering lights, perfumed and flower decorated will be kept opened for two days every year. Devotees will be permitted to enter the Vaikunta Pradakshina only after darshan of the Lord. Legends say that all the past sins and all vows made then will be fulfilled.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తులతో కిటకిటలాడుతున్న నారాయణగిరి ఉద్యానవనాలు

నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ

ఆకట్టుకునేలా భజన కార్యక్రమాలు

డిసెంబరు 28, తిరుమల 2017: డిసెంబరు 29న శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకునేందుకు గురువారం విశేషంగా భక్తులు తరలివచ్చారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్లు సాయంత్రానికి పూర్తిగా నిండిపోయాయి. ఇక్కడ వేచి ఉన్న భక్తులకు టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు పంపిణీ చేశారు.

భక్తులకు ఆధ్యాత్మికానందం కల్పించేందుకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి దర్శనానికి పట్టే సమయం, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్ల వివరాలు, భక్తులకు అందిస్తున్న వసతులను ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నారు. భక్తుల కోసం అదనంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటుచేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేసి అవసరమైన మందులను భక్తులకు అందిస్తున్నారు. శ్రీవారి సేవకుల సాయంతో బయటి క్యూలైన్లలోని భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నారు.

డిసెంబరు 29న స్వర్ణరథం :

డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నేత్రపర్వంగా స్వర్ణరథోత్సవం జరుగనుంది. డిసెంబరు 30న వైకుంఠ ద్వాదశి, స్వామిపుష్కరిణి తీర్థ ముక్కోటి సందర్భంగా తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు చక్రస్నాన మహోత్సవం జరుగనుంది.

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం :

ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దీనిని ముక్కోటి ఏకాదశిగా కూడా నిర్వచిస్తారు. ఏకాదశినాడు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని స్వర్ణరథోత్సవంలో పాల్గొనే భక్తులకు మూడుకోట్ల ఏకాదశుల పుణ్యఫలం దక్కుతుందని పురాణ ప్రాశస్త్యం. శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరుల్లో వెలసిన పుణ్యతీర్థాల స్నానఫలం దక్కుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

వైకుంఠ ద్వార దర్శనం :

వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాత సమయం నుంచి మరుసటిరోజు ద్వాదశి నాటి రాత్రి ఏకాంతసేవ వరకు శ్రీవారి గర్భాలయానికి దగ్గరగా అనుకుని ఉన్న ”ముక్కోటి ప్రదక్షిణమార్గం” తెరవబడుతుంది. ఈ ద్వారాలను వైకుంఠ ద్వారాలని, ఉత్తర ద్వారాలని అంటారు. ఈ మార్గాన్ని ”వైకుంఠ ప్రదక్షిణమార్గం” అని అంటారు. విద్యుద్దీపాలతో, సుగంధ మనోహర పుష్పాలతో అలంకరించిన ఈ వైకుంఠ ప్రదక్షిణంలో ప్రవేశించే భాగ్యం ఏడాదిలో ఈ రెండు రోజులు మాత్రమే కలుగుతుంది. స్వామివారిని దర్శించిన తరువాత వైకుంఠ ప్రదక్షిణంలో ప్రవేశం కలుగుతుంది. ఈ మార్గంలో ప్రవేశించిన భక్తులకు పూర్వపాపకర్మలు నశిస్తాయని, ఇష్టార్థాలన్నీ నెరవేరతాయని పురాణ ప్రాశస్త్యం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.