NAVARATRI UTSAVAMS AT TCNR_ సెప్టెంబరు 29 నుంచి అక్టోబ‌రు 8వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

Tirupati, 26 Sep. 19: The annual Navarathri Utsavams will commence in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor from September 30 onwards.

On each day, the deity will be dressed in different alankara to match the Navarathri occasion. While on the day of Vijayadasami, Goddess will take a celestial ride on Gaja Vahanam.

Arjitha sevas remained cancelled during these ten days in the temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 29 నుంచి అక్టోబ‌రు 8వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2019 సెప్టెంబరు 26: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 29 నుంచి అక్టోబ‌రు 8వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 8వ తేదీ విజయదశమినాడు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌, అక్టోబరు 2న అష్టోత్త‌ర శ‌త క‌లశాభిషేకం సేవ‌లు రద్ద‌య్యాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.