PADMAVATHI AS KALKI BLESSES DEVOTEES _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

TIRUPATI, 27 NOVEMBER 2022: On the penultimate day of Karthika Brahmotsavams at Tiruchanoor, Goddess Sri Padmavathi Devi as Kalki Avatara blessed Her Devotees all along the four Mada streets on Sunday evening.

The deity wearing Head Gear, charnakol in one hand and Sword in another hand appeared as a warrior on the Aswa Vahana, the last one among carriers.

Both the Pontiffs of Tirumala, Board members Sri Bhaskar Reddy, Sri Maruti Prasad, Sri Rameswara Rao, Sri Sampath Narayana, JEO Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar, DyEO Sri Lokanatham and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి, 2022 నవంబర్ 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, ఎమ్మెల్యే , టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ రామేశ్వరరావు, శ్రీ సంపత్ నారాయణ, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.