PADMAVATHI CHARMS AS VAIKUNTHANADHA PERUMAL _ పెద్దశేష వాహనంపై వైకుంఠనాథ పెరుమాళ్ అలంకారంలో శ్రీ పద్మావతి
Tiruchanoor, 24 November 2019: The divine mother charmed devotees in the alankara of “Sri Vaikuntha Perumal” on Pedda Sesha Vahanam on Sunday morning.
As a part of the ongoing annual karthika brahmotsavams on second day, the Goddess blessed Her devotees in the guise of her beloved Swamyvaru.
Sitting majestically on the special Asan on the vahanam, the Goddess holding Gadha in her left hand took out a celestial ride all along the mada streets.
Devotees who converged in large numbers, chanted Govinda… Govinda out of divine excitement on seeing the graceful appearance of Goddess on the seven hooded Pedda Sesha Vahanam.
HH Sri Sri Pedda Jeeyar Swamy, HH Sri Sri Chinna Jeeyar Swamy, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy, VGO Sri Prabhakar, Agama Advisor Sri Srinivasa Charyulu, Arjitham Inspector Sri Srinivasulu and others took part.
ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER,TIRUPATI
పెద్దశేష వాహనంపై వైకుంఠనాథ పెరుమాళ్ అలంకారంలో శ్రీ పద్మావతి
తిరుపతి, 2019 నవంబరు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథ పెరుమాళ్ అలంకారంలో శంకుచక్రాలు, గదతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ ప్రభాకర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, ఏవిఎస్వో శ్రీ నందీశ్వర్‌రావు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ కోలా శ్రీనివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.