PADMAVATHI PARINAYOTSAVAM ENTERS SECOND DAY _ వేడుకగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

Tirumala, 21 May 2021: The annual three-day Padmavathi Parinayotsavams entered the second day in Tirumala on Friday.

In view of the Covid pandemic, the Padmavathi Parinayotsavams are being observed in Ekantam in Kalyanotsava Mandapam in Tirumala temple.

On the second day, Sri Malayappa Swamy on Aswa Vahanam flanked by Sridevi and Bhudevi on separate Tiruchis were brought to the Mandapam where the celestial fete was observed with religious fervour.

The second day is considered auspicious among three days, as it was on this day the legends says that Srinivasa tied a celestial knot to Sri Padmavathi Devi.

The divine wedding observed with pomp and gaiety amidst chanting of Veda mantras, Raga, Tala, Vaidyam nivedana after carrying out the traditional Hindu marriage proceedings as per Agama

Board Member Sri DP Ananta, Temple DyEO Sri Harindranath, Archakas were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేడుకగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
 
తిరుమల, 2021 మే 21: తిరుమల శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్సవాలను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు.
 
శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో మ‌ధ్యాహ్నం 4 గంట‌లకు ఈ ఉత్సవ కార్యక్రమం ప్రారంభమైంది.  పరిణయోత్సవంలో రెండవ రోజైన శుక్రవారంనాడు వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా  తెలుస్తోంది. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది.  
 
ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ పల్లకీలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు. మొదటిరోజు మాదిరే శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు చేపట్టారు.  
 
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, అర్చకస్వాములు పాల్గొన్నారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.