PADMAVATI SRINIVASA PARINAYOTSAVAMS CONCLUDES _ ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

DEVOTIONAL INSTRUMENTAL MUSIC MESMERISES DEVOTEES 
 
TIRUMALA, 19 MAY 2024: The annual three-day Padmavati Pariyanotsavams concluded with divine splendour on a pleasant evening on Sunday.
 
On the last day Sri Malayappa Swamy arrived on Garuda while Sridevi and Bhudevi on two separate Tiruchis to the Parinayotsava Mandapam in Narayanagiri Gardens at Tirumala.
 
After the interesting Edurkolu, Poobantata, Varanamayiram, the deities were seated atop a finely decked swing. 
 
Chaturveda Parayanam, followed by presentation of Bhairavi, Nalinakanti, Shankarabharan, Hindustani, Kharaharapriya, Nilambari Raagas on Nadaswaram, Melam, Dhamaruka Vaidyam etc.
 
Later Sri Raghurama Krishna and team from Bengaluru have performed Annamacharya Sankeertans like Venkatachala Nilayam, Tandanana Ahi, Dasa Padagalu like Dasana Madiko Enna, Bhagyada Lakshmi Baaramma on instruments including Flute, Veena, Tabla on the occasionbin a mellifluous manner mesmerising devotees in Bhakti Rasa.
 
TTD EO Sri AV Dharma Reddy, SE 2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Lokanatham, others, devotees were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

•⁠ ⁠భక్తులను విశేషంగా ఆకట్టుకున్న భక్తి వాద్య సంగీతం

మే 19, తిరుమల 2024: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.

ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు. ఇందులో భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందూస్థాని, ఖరహరప్రియ,నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు.

తర్వాత బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం వేంకటాచల నిలయం, తందనానా ఆహి వంటి…. అన్నమాచార్య సంకీర్తనలు, దాస పదాలైన, భాగ్యద లక్ష్మీ బారమ్మ, దాసన మాడికో ఎన్న స్వామీ…వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.

అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి.

ఈ కార్యకమంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.