PANDURANGA ON SARVABHOOPALA _ సర్వభూపాల వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో గోవిందుడు

TIRUPATI, 19 MAY 2024: Sri Govindaraja Swamy adorned in Panduranga Alankaram blessed His devotees on the fourth evening as part of the ongoing annual Brahmotsavam in Tirupati on Sunday.

Sri Pedda Jeeyar Swamy, Sri Chinna Jeeyar Swamy of Tirumala, FACAO Sri Balaji, DyEO Smt Shanti and others, a huge number of devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సర్వభూపాల వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో గోవిందుడు

తిరుపతి, 2024 మే 19: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి స్వామి వారు పాండురంగ స్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు.

రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సర్వభూపాల వాహ‌నం – య‌శోప్రాప్తి :

సర్వభూపాల అంటే రాజులందరు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు.
వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ మోహన రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధనుంజయులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.