PALLAVOTSAVAM CELEBRATED IN TIRUMALA_ తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

Tirumala, 19 July 2017: In view of the birth anniversary of the Mysore Maharaja I, the unique Pallavotsavam festival was celebrated with religious fervour in Tirumala on Wednesday evening.

TTD has been observing this fete since several decades as a royal tributes to Mysore Maharaja I who made huge contributions to Lord Venkateswara.

After Sahasra Deepalankara Seva, the processional deity of Lord Malayappa Swamy was taken on a ride to Karnataka Chowltries at Tirumala where the Lord was accorded religious reception by the representatives of the Karnataka government and Mysore Sansthan.

Tirumala JEO Sri KS Sreenvasa Raju, temple peishkar Sri Ramesh were also present. Later the Lord was given special harati and prasadams were distributed to the pilgrims.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

తిరుమల, 2017 జూలై 19: మైసూర్‌ మహారాజు జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం తిరుమలలో పల్లవోత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారి పరమ భక్తుడైన మైసూర్‌ మహారాజు అచంచలమైన భక్తిభావంతో భూరి విరాళాలు అందించారు. ఆయన జ్ఞాపకార్థం కొన్ని దశాబ్దాలుగా టిటిడి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.

సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు ఈ సందర్భంగా స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జేఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు, పేష్కార్‌ శ్రీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.