PALLIKONDESWARA GETS SARE FROM VENKATESWARA _ సురుటుపల్లిలోని శ్రీ పళ్లికొండేశ్వర స్వామివారికి టిటిడి తరఫున పట్టువస్త్రాల సమర్పణ
TIRUMALA, 18 FEBRUARY 2023: On the auspicious occasion of Maha Sivaratri on Saturday, the sare from Tirumala Sri Venkateswara Swamy was presented to Suruttupplle Pallikondeswara Swamy.
A team of TTD officials led by Parupattedar Sri Uma Maheswara Reddy offered pattu vastrams to this unique temple where lord Siva will be seen in a lying posture.
The spouse of TTD Chairman Smt Swarnalata Reddy who accompanied the sare, received by the local legislator Sri Adimoolam, temple Chairman Sri Balaji Reddy, EO Sri Ramachandra Reddy and others.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
సురుటుపల్లిలోని శ్రీ పళ్లికొండేశ్వర స్వామివారికి టిటిడి తరఫున పట్టువస్త్రాల సమర్పణ
ఫిబ్రవరి 18, తిరుమల 2023: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రమైన సురుటుపల్లిలోని శ్రీ పళ్లికొండేశ్వర స్వామి వారికి టిటిడి తరఫున శనివారం పట్టు వస్త్రాలు సమర్పించారు.
టిటిడి ఛైర్మన్ సతీమణి శ్రీమతి స్వర్ణలతారెడ్డి, శ్రీవారి ఆలయ పారుపత్తేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి, వేదపారాయణదారులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి టిటిడి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం, ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ బాలాజిరెడ్డి, ఈవో శ్రీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.