PANCHAGAVYA ADHIVASAM HELD _ పేరూరు శ్రీ వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం

Tirupati, 19 June 2022:Panchagavya Adhivasam fete was observed at Patakalva (at Perurubanda near Tirupati) Sri Vakulamata temple on Sunday.

As part of ongoing Maha Samprokshana festivities in this temple, Pachchagavyadivasam fete was grandly performed by cleansing the idol with all the five natural products of Gomata including milk, curd, ghee, urine, and dung amidst chanting of Vedic mantras by Archakas.

Earlier, Punyahavachanam, Raksha Bandhana, Akalmasha, Homa, and Akshimochana rituals were held.

Later in evening the yagashala programs of Agni Pratista, Kalasa Sthapana, Kumbhavahana, Kumbha Aradhana and Ukta Homas will also be observed.

Vaikhanasa Agama Advisor Sri Vedanta Vishnu Bhattacharyulu, Special grade DyEO Smt Varalakshmi, DyEO Sri Gunabhushan Reddy, and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పేరూరు శ్రీ వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం

 తిరుపతి, 2022 జూన్ 19 ;పేరూరులో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో ఆదివారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉద‌యం 6.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, అక‌ల్మ‌ష‌హోమం, అక్షిమోచ‌నం జరిగింది. పంచగవ్యాలైన గోక్షీరం(పాలు), గోదధి(పెరుగు), నెయ్యి, గోమయం, పంచితంతో శిలావిగ్రహాన్ని శుద్ధి చేశారు.

సాయంత్రం 6.30 గంట‌లకు అగ్నిప్ర‌తిష్ట‌, క‌ల‌శ‌స్థాప‌న‌, కుంభావాహ‌నం, కుంభారాధ‌న‌, ఉక్త హోమాలు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆగమ సలహా దారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్య, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, డిప్యూటీ ఈవో శ్రీ గుణ భూషణ్ రెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.


టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.