PANCHAMI THIRTHA- HALLMARK OF AMMAVARI BRAHMOTSAVAM_ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల ప్రత్యేకవ్యాసం పంచమితీర్థం విశేషం

Tiruchanoor, 11 December 2018: The lagnam and muhurtam of celestial reincarnation of Goddess Padmavati in the temple tank Padmasarovaram is being celebrated as the Panchami Thirtham or the grand finale of the nine- day Karthika Brahmotsavam of Sri Padmavati Ammavari temple.

This year on the final day of Brahmotsavam on December 12 Panchami thirtham event is grandly celebrated, says Archakam Vakulabharanam Srinivasa Manikantha Bhattar.

Padma puranam is one of the 18 Puranas written by Maharshi Sri Veda Vyasa in which the incarnation of Goddess Sri Padmavati is narrated.

Legends say that Goddess Padmavati was reincarnated in Karthika masam, on Shukla paksha, Uttarashada Nakshatram on Friday on Panchami thithi amidst the 1000 petal golden lotus.

It is mentioned in the Sripada Padmapuranam that Lord had meditated for betting Goddess Padmavati.

PANCHAMI THIRTHA RITUAL:

Churnabhisekam is performed to Utsava idol of Goddess Padmavati on the Pachami thirtham day in the Dwajarohanam mandapam. Later it is taken to Panchami thirtha mandapam after abhyangana snanam. Later the festival of snapanam is performed in Panchami Thirtha mandapam.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల ప్రత్యేకవ్యాసం పంచమితీర్థం విశేషం

తిరుపతి, 2018 డిసెంబరు 11: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మపుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమితీర్థంగా వ్యవహరిస్తారు. బ్రహ్మూెత్సవాల చివరిరోజైన డిసెంబరు 12వ తేదీ బుధ‌వారం పంచమితీర్థ మహోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా పంచమితీర్థం, పద్మపుష్కరిణి వైశిష్ట్యాన్ని కంకణభట్టర్‌ శ్రీ శ్రీనివాసాచార్యులు తెలియజేశారు.

శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో పాద్మపురాణం ఒకటి. ఇందులో శ్రీపద్మావతి అమ్మవారి ఆవిర్భావాన్ని వివరించారు. వైకుంఠ లోకంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు శయనించి ఉండగా యజ్ఞానికి ఫలితమిచ్చే దైవం కోసం సప్తఋషులు వెతుకుతూ వచ్చారు. స్వామివారు యోగనిద్రలో ఉండి భ గుమహర్షిని చూడలేదు. కోపించిన భ గుమహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నారు. స్వామివారి వక్షస్థలంలో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారు ఆగ్రహం చెంది పాతాళలోకానికి వెళ్లిపోయారు.

స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ పాతాళలోకానికి వచ్చారు. అమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకుని 56 దేశాలు తిరిగారు. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన కొల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారు దర్శించి పూజలు చేశారు. ఆ సమయంలో ఆకాశంలో అశరీరవాణి వినిపించింది. ”స్వర్ణముఖి నదీతీరానికి వెళ్లి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలు, తపం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు” అని తెలిపింది. స్వామివారు స్వర్ణముఖి నదీతీరానికి చేరుకుని ‘కుంతలము’ అనే ఆయుధంతో పుష్కరిణిని తవ్వారు. వాయుదేవున్ని పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారు. స్వర్ణ కమలాలు వికసించేందుకు వైఖానసాగమోక్తంగా శ్రీసూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించారు.

స్వామివారు క్షీరం(పాలు)ను మాత్రమే ఆహారంగా తీసుకుని 12 సంవత్సరాల పాటు శ్రీమంత్ర జప తప అర్చన చేశారు. 13వ సంవత్సరం కార్తీక మాసంలో శుక్ల పక్షం, ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం పంచమి తిథినాడు వాతావరణం ప్రసన్నమైంది. సహస్రదళ బంగారుపద్మం నుంచి నాలుగు చేతులతో, పద్మాల వంటి కళ్లతో, సకల దివ్య ఆభరణాలు, వస్త్రాలు, పుష్పాలతో శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు. సత్యలోకం నుంచి బ్రహ్మ హంస వాహనంపై, కైలాసం నుంచి పార్వతి పరమేశ్వరులు వ షభంపై, సచిదేవి ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, సనకాది యోగులు, సప్తఋషులు, ప్రహ్లాదుడు మొదలైన భక్తులు, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషులు ఆకాశం నుంచి రాగా, దేవగంధర్వులు మంగళవాయిద్యాలు మోగిస్తుండగా తామరపూల మాలను శ్రీనివాసుని కంఠానికి శ్రీపద్మావతి అమ్మవారు అలంకరించారు. శ్రీనివాసుడు తామరపుష్పాన్ని అమ్మవారికి అలంకరించారు. 108 దివ్యదేశాల్లో అమ్మవారు స్వామివారికోసం తపస్సు చేసినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. తిరుచానూరులో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కోసం శ్రీనివాసుడు తపస్సు ఆచరించినట్టు శ్రీ పాద్మపురాణంలో ఉండడం విశేషం.

పంచమితీర్థం ఉత్సవ క్రమం :

చూర్ణాభిషేకం :

పంచమితీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో చూర్ణాభిషేకం నిర్వహిస్తారు. ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో అభ్యంగన స్నానం చేయిస్తారు. అమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వుల నూనె, చూర్ణపొడి కలిపి ఈ క్రతువు నిర్వహిస్తారు. అమ్మవారిని ఆవాహన చేసి శ్రీ మంత్రం శ్రీ సూక్తం పఠిస్తారు. అభ్యంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమితీర్థ మండపానికి వేంచేపు చేస్తారు.

పంచమితీర్థ మండపంలో :

పంచమితీర్థ మండపంలో వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆశీనులను చేస్తారు. 9 కలశాల్లో ఆవాహన చేసి అనుజ్ఞ స్వీకరిస్తారు. విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ఉపచారాలు సమర్పిస్తారు. ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె, పసుపు కుంకుమ, చందనం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలు, దివ్యమాలలు, దివ్య ఆభరణాలు, లడ్డూ, వడ, అప్పం తదితర ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె ముందుగా తిరుపతిలోని శ్రీకోదండ రామాలయం, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయాల మర్యాదలు స్వీకరించి తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంటుంది. అక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయ అధికారులు స్వాగతం పలికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.