SARVA SWATANTRA VEERA LAKSHMI TAKES PRIDE RIDE ON MAMMOTH WOODEN CHARIOT_ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

Tiruchanoor, 11 December 2018: On the penultimate day of the ongoing Navahnika brahmotsavams in Tiruchanoor, Sri Padmavathi Devi who is worshipped here as Sarva Swatantra Veera Lakshmi took out a pride ride on the gigantic wooden chariot on Tuesday morning.

Radhotsavam is yet another important fete during the Karthika Brahmotsavams of Ammavaru. The procession commenced in the auspicious Vrischika Lagnam by 8.15am.

The streets of the temple centre was flooded with devotees as it is during this festival the denizens gets an opportunity to pull the chariot.

Goddess in all Her divine splendour was draped in pearl studded sarer and embellishments to showcase her grandeur. The devotees were captivated by the elegance of Goddess seated atop the finely decked wooden chariot.

TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy,Dy.EO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

తిరుపతి, 2018 డిసెంబరు 11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయం 8.15 గంటలకు వృశ్చిక లగ్నంలో ప్రారంభమైన రథం 10.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. పిల్లల నుండి పెద్దల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి.

శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.

రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12.00 నుండి 1.30 గంటల వరకు రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, చంద్రగిరి ఎమ్‌ఎల్‌ఏ శ్రీచెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీగోపినాధ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అశ్వవాహనంపై లోకరక్షణి

అలాగే రాత్రి 8.00 గంటల నుండి 11.00 గంటల వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో అమ్మవారు విహరించనున్నారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాఙ్మయం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయవేళ సాక్షిగా అశ్వం నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవాభాగ్యాన్ని పొందుతున్న భక్తులకు కలిదోషాలను తొలగిస్తుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.